IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ యాడ్ రెవెన్యూ ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..!!

ABN , First Publish Date - 2023-07-04T14:26:26+05:30 IST

ఈ ఏడాది యాడ్ రెవెన్యూలో కూడా ఐపీఎల్ అదరగొట్టింది. ఈ సీజన్‌లో ఐపీఎల్ యాడ్ రెవెన్యూ రూ.10,120 కోట్లకు చేరిందని లైవ్ మింట్ వెబ్‌సైట్ వెల్లడించింది. సోషల్ మీడియా, ట్రెడిషనల్ మీడియా, ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐపీఎల్‌కు భారీగా యాడ్ రెవెన్యూ వచ్చినట్లు తెలుస్తోంది.

IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ యాడ్ రెవెన్యూ ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..!!

ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు ఉన్న విపరీతమైన ఆదరణ ఉంటుంది. అందుకే ఈ మెగా లీగ్‌ను అందరూ కాసుల లీగ్‌గా అభివర్ణిస్తుంటారు. 2008 నుంచి జరుగుతున్న ఐపీఎల్ ఈ ఏడాది కూడా ఎంతో ఆసక్తికరంగా జరిగింది. ఫైనల్ మ్యాచ్ రెండు రోజులు జరిగినా క్రికెట్ అభిమానులు వీక్షించారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంతో ఓవరాల్‌గా ఐదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు యాడ్ రెవెన్యూలో కూడా ఐపీఎల్ అదరగొట్టింది. ఈ సీజన్‌లో ఐపీఎల్ యాడ్ రెవెన్యూ రూ.10,120 కోట్లకు చేరిందని లైవ్ మింట్ వెబ్‌సైట్ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: కెమెరామెన్‌గా మారిన ఇషాన్ కిషన్.. విండీస్ పర్యటనలో టీమిండియా ఏం చూస్తుందో చూడండి!..

సోషల్ మీడియా, ట్రెడిషనల్ మీడియా, ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐపీఎల్‌కు భారీగా యాడ్ రెవెన్యూ వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 95 శాతం ఆదాయం ఈ మూడింటి ద్వారా సమకూరినట్లు లైవ్ మింట్ తెలిపింది. వచ్చిన ఆదాయంలో 65 శాతం బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానులు, బ్రాడ్ కాస్టర్లు నేరుగా అందుకున్నట్లు వివరించింది. ఎక్కువగా యాడ్ రెవెన్యూ వీకెండ్స్‌లోనే వచ్చిందని తెలుస్తోంది. అటు యాడ్ రెవెన్యూలో రూ.4,700 కోట్ల ఆదాయాన్ని శాటిలైట్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, డిజిటల్ బ్రాడ్ కాస్టర్ జియో సినిమా ఆర్జించాయి. ఓవర్ మధ్యలో వచ్చే ప్రకటనలతో పాటు అఫీషియల్ బ్రాండ్ పార్ట్‌నర్ల ద్వారా ఆయా బ్రాడ్ కాస్టర్లు ఆదాయాన్ని అందుకున్నాయి. మరోవైపు వచ్చిన యాడ్ రెవెన్యూలో రూ.1450 కోట్లను 10 ఫ్రాంచైజీలు అందుకున్నాయి. యాడ్ రెవెన్యూ ద్వారా బీసీసీఐకి రూ.430 కోట్లు సమకూరాయి. స్పాన్సర్ షిప్, స్టేడియం అడ్వర్‌టైజింగ్ ద్వారా బీసీసీఐకి ఈ ఆదాయం వచ్చినట్లు లైవ్ మింట్ తెలిపింది.

Updated Date - 2023-07-04T15:04:13+05:30 IST