Indore Test: చెత్తగా ఆడి ఆలౌట్ అయిన భారత జట్టు.. ఆసీస్ ముందు ఉఫ్‌మని ఊదేసేంత లక్ష్యం

ABN , First Publish Date - 2023-03-02T17:10:20+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆల్ రౌండర్ ప్రతిభ చూపిన భారత జట్టు(

Indore Test: చెత్తగా ఆడి ఆలౌట్ అయిన భారత జట్టు.. ఆసీస్ ముందు ఉఫ్‌మని ఊదేసేంత లక్ష్యం

ఇండోర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆల్ రౌండర్ ప్రతిభ చూపిన భారత జట్టు(Team India) మూడో టెస్టులో చతికిల పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో163 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 76 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలర్లు రాణించినప్పటికీ బ్యాటర్లు మాత్రం రెండు ఇన్నింగ్స్‌లలోనూ బోల్తాపడ్డారు. ఆసీస్ బౌలర్ నాథన్ లయన్(Nathan Lyon) భారత్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఏకంగా 8 వికెట్లు పడగొట్టి భారత్‌పై సరికొత్త రికార్డు సృష్టించాడు. అతడి దెబ్బకు రోహిత్ శర్మ (12), శుభమన్ గిల్ (5), చతేశ్వర్ పుజారా ((59), రవీంద్ర జడేజా (7), శ్రీకర్ భరత్ (3), రవిచంద్రన్ అశ్విన్ (16), ఉమేశ్ యాదవ్ (0), మహమ్మద్ సిరాజ్ (0) పెవిలియన్‌కు చేరారు. పుజారా అర్ధ సెంచరీతో ఆదుకోకపోతే జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

అంతకుముందు ఆస్ట్రేలియా 197 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 156/4తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్ మరో 41 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటయ్యారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ ఉమేష్ యాదవ్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. హ్యాండ్స్‌కోంబ్(19), అలెక్స్ క్యారీ(3), లియోన్(5)లను అశ్విన్ బోల్తా కొట్టించగా.. గ్రీన్(21), స్టార్క్(1), టీ ముర్ఫీ(0)లను ఉమేష్ యాదవ్ వెనక్కిపంపించాడు. దీంతో ఆసీస్‌కు 88 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 163 పరుగులకే కుప్పకూలడంతో 75 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. భారత జట్టు ఆలౌట్ కావడంతో రెండో రోజు ఆట ముగిసింది.

Updated Date - 2023-03-02T17:39:37+05:30 IST