Gurbaz: గుర్తుండిపోయేలా ఆడిన గుర్బాజ్.. చివర్లో చెలరేగిన బర్త్‌డే బాయ్ రసెల్

ABN , First Publish Date - 2023-04-29T18:19:21+05:30 IST

జాసన్ రాయ్ (Jason Roy) స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmalullah Gurbaz)

Gurbaz: గుర్తుండిపోయేలా ఆడిన గుర్బాజ్.. చివర్లో చెలరేగిన బర్త్‌డే బాయ్ రసెల్

కోల్‌కతా: జాసన్ రాయ్ (Jason Roy) స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmalullah Gurbaz) చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఇక, చివర్లో బర్త్‌డే బాయ్ రసెల్ (Andre Russel) బ్యాట్‌తో విరుచుకుపడడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ (GT) ప్రత్యర్థి కేకేఆర్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ జగదీశన్ (19), శార్దూల్ ఠాకూర్ (0), వెంకటేశ్ అయ్యర్ (11), కెప్టెన్ నితీశ్ రాణా (4) నిరాశ పరిచినప్పటకీ క్రీజులో అతుక్కుపోయిన రహ్మానుల్లా గుర్బాజ్ బ్యాట్‌తో వీరంగమేశాడు. బంతిని స్టేడియం నలువైపులా తరలిస్తూ పరుగులు పిండుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని మోతకెక్కించాడు. మొత్తం 39 బంతులు ఆడిన గుర్బాజ్ 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న రింకూ సింగ్ కూడా నిరాశ పరిచాడు. 20 బంతుల్లో ఓ సిక్సర్‌తో 19 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక, బర్త్‌డే బాయ్ ఆండీ రసెల్ చక్కని ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 34 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీకి మూడు వికెట్లు దక్కగా, జోషువా లిటిల్, నూర్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-04-29T18:19:21+05:30 IST