Anjali Sarvani: మెగా వేలంలో తెలుగమ్మాయిలకు అదిరిపోయే ధర!

ABN , First Publish Date - 2023-02-13T20:07:00+05:30 IST

టీమిండియా మహిళా జట్టులో చోటు సంపాదించుకుని సత్తా చాటిన తెలుగమ్మాయి అంజలి శర్వాణి(Anjali Sarvani)కి మహిళల ప్రీమియర్ లీగ్

Anjali Sarvani: మెగా వేలంలో తెలుగమ్మాయిలకు అదిరిపోయే ధర!

ముంబై: టీమిండియా మహిళా జట్టులో చోటు సంపాదించుకుని సత్తా చాటిన తెలుగమ్మాయి అంజలి శర్వాణి(Anjali Sarvani)కి మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో అదిరిపోయే ధర లభించింది. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ ఆమెను రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. గత డిసెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఈ లెఫ్టార్మ్ సీమర్.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ ఆడింది. అలాగే, విజయవాడకు చెందిన టీమిండియా ప్లేయర్ సబ్బినేని మేఘన(Sabbhineni Meghana)ను గుజరాత్ జెయింట్స్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది.

రూ. 10 లక్షలకు అమ్ముడైన వారు వీరే..

* ఇంద్రాణి రాయ్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

* వికెట్ కీపర్ లక్ష్మి యాదవ్‌ - యూపీ వారియర్జ్

* దిశ కసంత్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

* ధర గుజ్జార్ - ముంబై ఇండియన్స్

* తారా నోరిస్ - ఢిల్లీ కేపిటల్స్

* ఎస్.యశశ్రీ - యూపీ వారియర్జ్

* పర్షవి చోప్రా - యూపీ వారియర్జ్

రూ.20 లక్షల ధర పలికిన ఆటగాళ్లు

* జసియా అక్తర్ - ఢిల్లీ కేపిటల్స్

రూ. 25 లక్షలు

* టిటాస్ సాధు - ఢిల్లీ కేపిటల్స్

రూ. 30 లక్షల ధర పలికింది వీరికే

* మోనికా పటేల్ - గుజరాత్ జెయింట్స్

* టారెన్ బెల్ - యూపీ వారియర్జ్

* మాన్సి జోషి - గుజరాత్ జెయింట్స్

* ఇసాబెల్లె వోంగ్ - ముంబై ఇండియన్స్

* హెదర్ గ్రహమ్ - ముంబై ఇండియన్స్

* ఎరిన్ బర్న్స్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

* సబ్బినేని మేఘన - గుజరాత్ జెయింట్స్

రూ. 40 లక్షలు

* శ్వేతా షెరావత్ - యూపీ వారియర్జ్

* రాధా యాదవ్ - ఢిల్లీ కేపిటల్స్

రూ. 45 లక్షలు

* లారా హారిస్ - ఢిల్లీ కేపిటల్స్

రూ. 50 లక్షలు

* దయాళన్ హేమలత - గుజరాత్ జెయింట్స్

* అమన్‌జోత్ కౌర్ - ముంబై ఇండియన్స్

రూ. 60 లక్షలు

* శిఖా పాండే - ఢిల్లీ కేపిటల్స్

రూ. 70 లక్షలు

* స్నేహ్ రాణా - గుజరాత్ జెయింట్స్

రూ. 75 లక్షలు

* అలీస్ కేప్సీ - ఢిల్లీ కేపిటల్స్

* జార్జియా వారెహమ్ - గుజరాత్ జెయింట్స్

* గ్రేస్ హారిస్ - యూపీ వారియర్జ్

రూ. 1.4 కోట్లు

* దేవిక విద్య - యూపీ వారియర్జ్

రూ. 1.5 కోట్లు

* మారిజానే కాప్ - ఢిల్లీ కేపిటల్స్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎల్లిస్ పెర్రీ, రేణుక సింగ్, రిచా

గుజరాత్ జెయింట్స్: ఆష్లీ గార్డ‌నర్, బెత్ మూనీ, సోఫియా డంక్లీ, సదర్‌లాండ్, డియోల్, డాటిన్

ఢిల్లీ కేపిటల్స్: జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ

ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ కౌర్, నట్ స్కివెర్ బ్రంట్, అమెలియా కెర్, పూజా వస్త్రాకర్, యస్తిక

యూపీ వారియర్జ్: సోపీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, తహ్లియా మెక్ గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, హీలీ, శ్రావణి, గైక్వాడ్, రోడ్రిగ్స్, లానింగ్, షెఫాలీ

Updated Date - 2023-02-13T20:07:06+05:30 IST