Wrestlers Protest: రెజ్లింగ్ చీఫ్ లైంగిక వేధింపుల కేసులో రెజ్లర్ల కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2023-06-26T09:55:33+05:30 IST
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసులో రెజ్లర్లుఎట్టకేలకు నిరసనలు విరమించారు.
న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ(WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై(Brij Bhushan Singh ) లైంగిక వేధింపుల(Sexual Harassment) కేసులో రెజ్లర్లు(Wrestlers) ఎట్టకేలకు నిరసనలు(Brij Bhushan Sharan Singh) విరమించారు. దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాన్ని రేకెత్తించిన మహిళా రెజ్లర్లు..ఐదు నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇకపై కోర్టులో తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఛార్జీషీటు దాఖలు హామీని నెరవేర్చిందని వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పునియా ఒకే విధంగా ట్వీట్‌తో ఈ విషయాన్ని ట్విట్టర్‌లో తెలిపారు. ప్రభుత్వం రెజ్లర్లతో ప్రభుత్వం చర్చలు..జూన్ 15న రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాక్షిమాలిక్ తెలిపారు.
ఈ కేసులో తమకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగుతుందని.. అయితే అది వీధుల్లోకాదు.. కోర్టులో అని మహిళా రెజ్లర్లు తెలిపారు. రెజ్లింగ్ అసోసియేషన్‌లో సంస్కరణలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రక్రియ ప్రారంభమైంది. జూలై11న జరిగే రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికలకోసం ఎదురు చూస్తున్నామని సాక్షి మాలిక్ ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు.
అయితే అసోం హైకోర్టులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(Indian Olympic Association (IOA), క్రీడా మంత్రిత్వ శాఖ(Sports Ministry), డబ్ల్యూ ఎఫ్‌ఐ(WFI)కి వ్యతిరేకంగా అసోం రెజ్లింగ్ అసోసియేషన్( Assam Wrestling Association (AWA)) దాఖలు చేసిన పిటిషన్‌పై అసోం హైకోర్టు స్టే విధించింది.
కాగా.. మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులతో రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని వినేష్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా టాప్ ఒలింపియన్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా రెజ్లర్ల నిరసన దేశవ్యాప్తంగా ఓ సంచలనం రేపాయి. అయితే మైనర్ రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని ఓవైపు పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు రెజ్లర్లపై లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ డబ్ల్యూ ఎఫ్‌ఐ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతల నుంచి రిలీవ్ చేయబడ్డారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు. నేరం రుజువైతే బ్రిజ్ భూషణ్ సింగ్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.