IndiaVsAustralia: ముగిసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌.. 41 పరుగులకే 6 వికెట్లు.. ఆధిక్యం ఎంతంటే..

ABN , First Publish Date - 2023-03-02T12:04:43+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో (Border-Gavaskar Trophy) భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IndiaVsAustralia) మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ (Australia) ఆలౌట్ అయ్యింది...

IndiaVsAustralia: ముగిసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌.. 41 పరుగులకే 6 వికెట్లు.. ఆధిక్యం ఎంతంటే..

ఇండోర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో (Border-Gavaskar Trophy) భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IndiaVsAustralia) మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ (Australia) ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 156/4తో రెండో రోజు బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ కేవలం మరో 41 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటయ్యారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ ఉమేష్ యాదవ్ చెరో 3 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ క్యూ కట్టారు. కేవలం 41 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లను చేజార్చుకున్నారు. హ్యాండ్స్‌కోబ్(19), అలెక్స్ క్యారీ(3), లియోన్(5)లను అశ్విన్ బోల్తా కొట్టించగా.. గ్రీన్(21), స్టార్క్(1), టీ ముర్ఫీ(0)లను ఉమేష్ యాదవ్ వెనక్కిపంపించాడు. దీంతో ఆసీస్‌కు 88 పరుగుల ఆధిక్యం లభించింది.

కాగా భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. లంచ్ విరామ సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఇంకా 75 పరుగుల లీడ్‌లో ఉంది. ప్రస్తుతం ఓపెనర్లు రోహిత్ శర్మ(5), శుభ్‌మన్ గిల్(4) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-03-02T12:12:32+05:30 IST