MS Dhoni: నా వైపు నుంచి సీఎస్కేకు బహుమతి... ధోనీ రిటైర్మెంట్‌పై అప్‌డేట్

ABN , First Publish Date - 2023-05-30T07:16:18+05:30 IST

ఐపీఎల్ 2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో ఐదవ సారి కైవసం చేసుకున్న తర్వాత ఎంఎస్ ధోని తన ఐపీఎల్ కెరీర్ కు సంబంధించి ప్రధాన అప్ డేట్ అందించారు....

MS Dhoni: నా వైపు నుంచి సీఎస్కేకు బహుమతి... ధోనీ రిటైర్మెంట్‌పై అప్‌డేట్
MS Dhoni

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో ఐదవ సారి కైవసం చేసుకున్న తర్వాత ఎంఎస్ ధోని తన ఐపీఎల్ కెరీర్ కు సంబంధించి ప్రధాన అప్ డేట్ అందించారు.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడించి ఐదవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను కైవసం చేసుకున్న(CSKs IPL 2023 Title Win) తర్వాత ధోని(MS Dhoni)తన రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యలు చేశారు.( Huge Update On Retirement)

‘‘నా వైపు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు ఒక బహుమతి’’ (A Gift From My Side)అంటూ ధోని పేర్కొన్నారు.‘‘నేను రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం. కానీ ఈ సంవత్సరం నేను ఎక్కడ ఉన్నా, నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయత.. ఇది నాకు తేలికైన విషయం కాదని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు’’ అని ధోని చెప్పారు.

ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్‌లో తమ అద్భుతమైన రికార్డును ఐదవ టైటిల్ విజయంతో సాధించింది. ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ధోని అందరి దృష్టిని ఆకర్షించారు.మొత్తం ఐపీఎల్, ఫైనల్ మ్యాచ్ కూడా ధోనీ-మేనియాతో నిండింది. ధోనీ వచ్చే ఏడాది మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ కి నాయకత్వం వహిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-05-30T07:27:01+05:30 IST