Viral Video: ఈ కుర్రాడెవరో కానీ.. వెరైటీ హెల్మెట్‌తో పోలీసులను కడుపుబ్బా నవ్వించేశాడు..!
ABN , First Publish Date - 2023-11-21T19:45:12+05:30 IST
బన్నీ హెల్మెట్ ధరించి పోలీసులకే కితకితలు పెట్టిన యువకుడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వెరైటీ కంటెంట్‌కు కొదవే లేదు. ఒక్కో వీడియో చూసే కొద్దీ నవ్వాగక కడుపు నొప్పి రావాల్సిందే. అలాంటి ఓ యువకుడి వీడియో(Viral Video) ఇప్పుడు జనాలకు కితకితలు పెడుతోంది. యువకుడి తీరుకు పోలీసులకు కూడా నవ్వాగలేదంటే కుర్రాడి కామెడీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ వీడియోలో ఏముందంటే, ఓ వ్యక్తి వింత హెల్మెట్ ధరించాడు. హెల్మెట్ చుట్టూ కుందేలు ఆకారంలో ఉన్న తొడుగు అమర్చాడు. హెల్మెట్‌కు ఓ కెమెరా కూడా తగిలించాడు. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు ఒకరు యువకుడిని చూసి షాకైపోయాడు, ఆ తరువాత అతడితో ఫన్నీ సంభాషణ ప్రారంభించాడు. ‘‘నువ్వు ఏం చేస్తుంటావు. ఇలాంటి హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నావు. నువ్వేమైనా కుందేలువా?’’ అంటూ సరదా ప్రశ్నలు వేశాడు. కొందరేమో అసలు హెల్మెట్ పెట్టుకోరు, మరికొందరేమో ఇలాంటి హెల్మె్ట్లు పెట్టుకుంటూ ఉంటారు అంటూ సరదా కామెంట్ చేశారు. ఆ తరువాత కుర్రాడిని పంపించేశాడు(Youth wearing bunny helmet makes cop erupt into laughter).
Viral Video: లోకల్ ట్రైన్‌లో ఫైవ్‌స్టార్ రెస్టారెంట్..విదేశాల్లో కాదండోయ్.. మన దగ్గరే..!
అయితే, ఏకంగా పోలీసునే నవ్వించిన యువకుడిని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కుర్రాడు నిజంగా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడంటూ కొందరు కామెంట్ చేశారు. ప్రజలతో సరదాగా వ్యవహరించిన పోలీసునూ కొందరు ప్రశంసించారు. ఇలాంటి ఫ్రెండ్లీ పోలీసుల అవసరం సమాజానికి ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. ఇలా జనాలను ఆకట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Viral: నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూడను.. ఆనంద్ మహింద్రా సంచలన ప్రకటన..కారణం తెలిస్తే..