ఆన్లైన్లో శానిటరీ ప్యాడ్స్ ఆర్డర్ పెట్టిన మహిళకు షాకింగ్ అనుభవం.. ఈ పని చేసిందెవరని ట్విట్టర్ లో ప్రశ్న.. ఇంతకూ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-01-27T12:21:39+05:30 IST

శానిటరీ ప్యాడ్స్ తో పాటు ఆమెకు కనిపించినవి చూసి షాక్ కు గురైంది..

ఆన్లైన్లో శానిటరీ ప్యాడ్స్ ఆర్డర్ పెట్టిన మహిళకు షాకింగ్ అనుభవం.. ఈ పని చేసిందెవరని ట్విట్టర్ లో ప్రశ్న.. ఇంతకూ ఏం జరిగిందంటే..

ఓ మహిళ పీరియడ్స్ సమయంలో తనకు అవసరమైన శానిటరీ ప్యాడ్స్ ను ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ అందుకున్న తరువాత ఆ పార్సెల్ ఓపెన్ చేసి చూసి షాక్ కు గురయ్యింది. ఈ సంఘటనకు సంబందించి వివరాల్లోకి వెళితే..

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లలో ఒకటైన స్విగ్గీలో నిత్యావసర వస్తువులు డెలివరీ ఇచ్చే స్విగ్గీ ఇన్స్టామార్ట్ సెక్షన్ ఉంటుంది. అందులో ఢిల్లీకి చెందిన సమీర అనే మహిళ శానిటరీ ప్యాడ్స్ ఆర్డర్ పెట్టింది. ఆమె ఆర్డర్ అందుకున్న తరువాత ఓపెన్ చేసి చూడగా షాక్ కు గురైంది. శానిటరీ ప్యాడ్స్ తో పాటు అందులో చాక్లెట్ తో తయారు చేసిన బిస్కెట్ల ప్యాకెట్ కూడా ఉండటమే ఆమె షాక్ అవ్వడానికి కారణం. సాధారణంగా ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చాక్లెట్, ఇతర తీపి పదార్థాలు తినడానికి ఇష్టపడతారు. తీపిపదార్థాలు మహిళల చిరాకు, అసహనం, కోపం వంటి మూడ్స్ ను కంట్రోల్ చెయడమే కాకుండా నెలసరి కండరాల నొప్పులు, తిమ్మిర్లు తగ్గించడంలో కూడా సహాయపడతాయి. సదరు మహిళ ఆర్డర్ తో పాటు చాక్లెట్ తో తయారుచేసిన బిస్కెట్లు కూడా డెలివరీ ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్యానికి గురైంది. 'వీటిని స్విగ్గీ ఇన్స్టామార్ట్ వారే నాకు పంపించారా లేక షాప్ కీపర్ ఇలా చేసాడా?' అంటూ స్విగ్గీని ట్యాగ్ చేస్తూ సదరు మహిళ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.

ఆమె ట్వీట్ కు స్విగ్గీ కేర్ వారు స్పందించారు. 'ఈరోజును మీరు సంతోషంగా గడపాలని మేము కోరుకున్నాం. అందుకే మేము వాటిని పంపించాం' అని ఆమెకు రిప్లై ఇచ్చారు. ట్విట్టర్ లో ఈ పోస్ట్ చూసిన కొందరు విభిన్నరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసారు. 'ఆన్లైన్ డెలివరీ యాప్ లు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ఇలాంటివి పంపుతుంటారు. నా దగ్గర ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్లు, ప్రొటీన్ బార్ లు చాలా ఉన్నాయి' అని ఒక మహిళ స్పందించింది. మరొకరు మాత్రం 'ఆడవారి పరిస్థితిని ఎంతబాగా అర్థం చేసుకున్నారో..' అంటూ కామెంట్ చేసింది. ఏది ఏమైనా వ్యాపార సూత్రాలు మనుషుల ఎమోషన్స్ ను టచ్ చేస్తున్నాయని కొందరంటున్నారు.

Updated Date - 2023-01-27T12:21:52+05:30 IST