మా వాళ్లే నన్ను చంపేస్తారు.. కాపాడండి.. అని పోలీసులను వేడుకున్నా లైట్ తీసుకున్నారు.. సరిగ్గా రెండు రోజుల తర్వాత చూస్తే..

ABN , First Publish Date - 2023-03-05T17:37:59+05:30 IST

సరే మేము చూసుకుంటాంలే నువ్వు ఇంటికెళ్ళు' అని పోలీసులు చెప్పారు కానీ..

మా వాళ్లే నన్ను చంపేస్తారు.. కాపాడండి.. అని పోలీసులను వేడుకున్నా లైట్ తీసుకున్నారు.. సరిగ్గా రెండు రోజుల తర్వాత చూస్తే..

ఆ అమ్మాయి ఎంతో కంగారుగా పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ఆయాసపడుతూ.. కారుతున్న చెమట తుడుచుకుంటూ 'సార్.. మా అమ్మా, నాన్న, అన్న నన్ను చంపేస్తారు. దయచేసి నన్ను కాపాడండి సార్.. వాళ్ళ నుండి నాకు ప్రాణ హాని ఉంది' అని పోలీసులకు చెప్పింది. ఆ అమ్మాయి మాటలు విన్న పోలీసులు 'నువ్వేం చేశావో.. వాళ్ళు నిన్ను ఎందుకు చంపుతారో.. ఈ కాలం అమ్మాయిలు ఇంతే! ఏదో ఒకటి చేసి తరువాత తల్లిదండ్రులు ఏదో చేస్తారంటూ మా చుట్టూ తిరుగుతారు' అని విసుక్కున్నాడు పోలీస్ ఆఫీసర్. 'అది కాదు సార్.. నిజంగానే వాళ్ళు నన్ను చంపేస్తారు సార్. నన్ను కాపాడండి' అని కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. 'సరే మేము చూసుకుంటాంలే నువ్వు ఇంటికెళ్ళు' అని అన్నాడు అతను. సరిగ్గా రెండురోజుల తరువాత ఆ అమ్మాయి తన వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకుంది. ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ బాధాకరమైన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని హాపూర్ లో మీనాక్షి అనే అమ్మాయి కుటుంబం నివసిస్తోంది. ఆ అమ్మాయి అదే గ్రామానికి చెందిన అబ్బాయితో ప్రేమలో ఉంది. ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు చాలా ఉగ్రులైపోయారు. 'ప్రేమించిన వాడిని మరచిపో.. లేకపోతే వాన్ని కాదు మొదట నిన్ను చంపేస్తాం' అని గట్టిగా చెప్పారు. కానీ అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సీరియస్ గా ప్రేమలో ఉన్నారు. వారిద్దరూ భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దాంతో అమ్మాయి తల్లిదండ్రుల మాటలు పట్టించుకోలేదు. అమ్మాయి ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి అమ్మాయి తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు హెచ్చరించారు.

read also: శోభనం గదిలో భార్యాభర్తల మధ్య గొడవ.. ఏమైందని బంధువులంతా కంగారుగా అడిగితే ఆ నవవధువు చెప్పిన అసలు నిజాన్ని విని..


తమ కుటుంబ సభ్యులు ఎంతకైనా తెగించే రకమని అమ్మాయికి అనిపించింది. తమకు సహాయం చేసేవాళ్ళు ఎవరా అని ఆలోచించింది. పోలీసులైతే రక్షణ కల్పిస్తాని ఆశ పడింది. వెంటనే తమకు దగ్గరలో హఫీజ్ పూర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి 'నన్ను కాపాడండి మావాళ్ళ నుండి నాకు ప్రాణ హాని ఉంది. వాళ్ళు నన్ను చంపేస్తారు' అని వేడుకుంది. పోలీసులు ఆ అమ్మాయిని కాదు పొమ్మనలేక 'సరేలే మేము చూసుకుంటాం వెళ్ళు' అని అన్నారు. హమ్మయ్య పోలీసులు మాట ఇచ్చారు అనే ధైర్యంతో నిశ్చింతగా వెళ్ళింది ఆ అమ్మాయి. కానీ పోలీసులు ఆ అమ్మాయి పోలిస్ స్టేషన్ నుండి వెళ్ళిపోగానే ఆ విషయాన్ని వదిలేసి వాళ్ళపనుల్లో వాళ్లు పడిపోయారు. ఇంటికి వెళ్ళిన అమ్మాయి తన పనుల్లో తాను ఉండిపోయింది. ఎలా తెలిసిందో కానీ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ప్రాణ రక్షణ కోరిందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. తాము చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి తమ మీదే పోలీసులకు ఫిర్యాదు చేస్తుందా అని వాళ్ళు రగిలిపోయారు. రెండురోజుల తరువాత ఆ అమ్మాయిని చంపేశారు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా గ్రామంలోనే నిర్వహించారు. అయితే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులను ప్రశ్నించారు. అనంతరం వారే అమ్మాయిని చంపినట్టు పోలీసులు ధృవీకరించుకుని వారి మీద హత్య కేసు, సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించడమనే నేరాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు విచారణ జరుగుతోంది.

Updated Date - 2023-03-05T17:37:59+05:30 IST