Share News

One Side Love: పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు ఓ యువతి ప్రయత్నం.. అసలు కథేంటో తెలిసి నివ్వెరపోయిన పోలీసులు.. చివరకు..

ABN , First Publish Date - 2023-11-10T19:18:49+05:30 IST

అక్క మరిదిపై మనసు పారేసుకున్న ఓ యువతి అతడు తన ప్రేమను తిరస్కరించడంతో పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

One Side Love: పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు ఓ యువతి ప్రయత్నం.. అసలు కథేంటో తెలిసి నివ్వెరపోయిన పోలీసులు.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: అక్క మరిదిని చూసి మనసు పారేసుకుందో యువతి. అతడి ముందు తన ప్రేమనూ వ్యక్తీకరించింది. కానీ, అతడు మాత్రం కాదుపొమ్మన్నాడు. దీంతో, తీవ్ర మనోవేదనకు గురైన యువతి చివరకు పోలీసుల కళ్లముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంత పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే,

Shocking Video: చిన్న పిల్లాడిని ఎత్తుకుని పరుగులు తీసిన తండ్రి.. ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుందనుకుంటే.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఓ యువతి తన అక్క మరిదిని గాఢంగా ప్రేమించింది. ఆ యువకుడిది ఉత్తరప్రదేశ్‌లో బడోన్ జిల్లా. యువతి పెళ్లి చేసుకోమంటూ తన వెంట పడుతున్నా అతడు కన్నెత్తి చూడలేదు. పైపెచ్చు ఆమె అంటే తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పాడు. దీంతో, ఆ యువతి మానసికంగా దెబ్బతింది. అందరికీ తెలిసేలా ఆమె తన మనసులో మాట బయటపెడితే అతడు తిరస్కరించడం ఆమె తట్టుకోలేకపోయింది.

Police vs Woman: హెల్మెట్ ఏదయ్యా..? నీ హెల్మెట్ ఏది..? అంటూ పోలీసును ఈ మహిళ ఎలా ఆటాడేసుకుందో మీరే చూడండి..!


చివరకు ఎన్సీఆర్ ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లింది. పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకున్న ఆమె సడెన్‌గా ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసుకుంది. వెంటనే అలర్టైన పోలీసులు దారుణం జరగకమునుపే ఆమెను కాపాడారు. యువతికి స్వల్పంగా గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. యువతి చేసిన పనికి స్థానికంగా పెనుకలకలమే రేగింది. యువతి కుటుంబసభ్యులతో పాటూ యువకుడి తరపు వారూ దిమ్మెరపోయారు. అయితే, ఆమెకు ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Vivek Ramaswamy: నువ్వో చెత్త, నా కూతురి పేరెత్తొద్దు..వివేక్ రామస్వామిపై విరుచుకుపడ్డ అమెరికన్ నేత

NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట

Woman Constable: ఈ ఫొటోలోని కానిస్టేబుల్ ఉద్యోగం ఊస్ట్.. తెలియక ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో పోలీస్ శాఖలో హాట్ టాపిక్..!

Updated Date - 2023-11-10T19:38:10+05:30 IST