Shocking Video: రైలులో అమ్మాయిల షాకింగ్ ప్రవర్తన.. గంజాయి, సిగరెట్లు తాగుతూ రచ్చ.. చివరకు..

ABN , First Publish Date - 2023-02-28T14:58:40+05:30 IST

తాజాగా ఓ రైలులో కొందరు అమ్మాయిల విచ్చలవిడి ప్రవర్తన సాటి ప్రయాణికులకు షాకిచ్చింది. ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి ఏకంగా రైల్వే మంత్రికి పంపించి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై రైల్వే శాఖ స్పందించింది.

Shocking Video: రైలులో అమ్మాయిల షాకింగ్ ప్రవర్తన.. గంజాయి, సిగరెట్లు తాగుతూ రచ్చ.. చివరకు..

పబ్లిక్ ప్లేస్‌ల్లోనూ, రైలు, బస్సులు వంటి ప్రభుత్వ వాహనాల్లోనూ స్మోకింగ్ (Smoking) చేయడం, గుట్కా నమలడం వంటివి నిషేధం. అయితే కొందరు ఆ నిబంధనలను పట్టించుకోకుండా ఇతర ప్రయాణికులను ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా ఓ రైలులో కొందరు అమ్మాయిలు ఏకంగా గంజాయి తాగుతూ సాటి ప్రయాణికులకు షాకిచ్చారు (Woman Smoking Marijuana in train). ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి ఏకంగా రైల్వే మంత్రికి పంపించి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై రైల్వే శాఖ స్పందించింది.

టాటానగర్ నుంచి కతిహార్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో (Smoking in Train) అసన్సోల్ వద్ద కొందరు అమ్మాయిలు ఎక్కారు. వారు రాత్రంతా ఆ రైలులో విచ్చలవిడిగా ప్రవర్తించారు. రైలు డోర్ దగ్గర నిల్చుని గంజాయి, సిగరెట్లు కాల్చారు. మత్తులో గోల చేశారు. ఆ అమ్మాయిల ప్రవర్తనను పరమానంద్ కుమార్ సా అనే వ్యక్తి వీడియో తీసి రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కు (Railways Minister Ashwini Vaishnaw) ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. అసన్సోల్ వద్ద రైలు ఎక్కిన ఈ అమ్మాయిలు రాత్రంతా సిగరెట్లు గంజాయి తాగారు అంటూ ఒక ట్వీట్‌ చేసి వీడియోను పంచుకున్నాడు. ఆ ఫిర్యాదుపై రైల్వే శాఖ (Indian Railways) వెంటనే స్పందించింది.

Viral Video: నడి వీధిలో రొమాన్స్.. ప్రియుడు చేసిన పనికి యువతి ఆగ్రహం.. చివరకు ఏం జరిగిందంటే..

అతని ప్రయాణ వివరాలు (PNR/Train No), మొబైల్ నెంబర్‌ను మెయిల్ ద్వారా తమకు పంపించాలని కోరింది. అలాగే http://railmadad.indianrailways.gov.in వెబ్‌సైట్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. కాగా, రైలులో ఆ అమ్మాయిల ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-02-28T14:58:40+05:30 IST