అది సినిమా హాలు కాదు.. కళా వేదిక అసలే కాదు... అయినా ఆపరేషన్ చేసే గదిని థియేటర్ అని ఎందుకంటారంటే...
ABN , First Publish Date - 2023-03-21T10:23:43+05:30 IST
వైద్యులు ఆపరేషన్ చేసే గదిని ఆపరేషన్ థియేటర్(operation theater) అని అంటారనే విషయం అందరికీ తెలిసిందే. శస్త్రచికిత్స చేసే స్థలానికి థియేటర్ అనే పదం ఎందుకు జత చేరిందని ఎప్పుడైనా ఆలోచించారా?
వైద్యులు ఆపరేషన్ చేసే గదిని ఆపరేషన్ థియేటర్(operation theater) అని అంటారనే విషయం అందరికీ తెలిసిందే. శస్త్రచికిత్స చేసే స్థలానికి థియేటర్ అనే పదం ఎందుకు జత చేరిందని ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా సినిమాలు ప్రదర్శించే ప్రాంతాన్ని థియేటర్ అంటారు.
అలాగే క్రీడలు(Sports) ఆడే ప్రాంతాన్ని స్టేడియం అని అంటారు. అలాంటప్పుడు అటు క్రీడలకు, ఇటు సినిమాలకు సంబంధం లేని ఆపరేషన్ గదిని థియేటర్ అని ఎందుకంటారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. దానికి ఇప్పుడు సరైన సమాధానం(Answer) తెలుసుకుందాం.
నిజానికి థియేటర్ అనేది గ్రీకు పదం. దీనికి 'చూడవలసిన ప్రదేశం' అని అర్థం. 20వ శతాబ్దంలో శస్త్రచికిత్స(surgery) ప్రక్రియ చాలా కష్టతరంగా ఉండేది. ఆ సమయంలో రోగి అపస్మారక స్థితి(unconsciousness)కి చేరుకోకుండా ఆపరేషన్ చేయవలసి వచ్చేది. 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఆసుపత్రుల్లో ఆపరేషన్ గదులు సినిమా థియేటర్ల(Movie theaters) మాదిరిగానే నిర్మితమయ్యేవి.
ఆ రోజుల్లో సర్జరీని చూసేందుకు వైద్య విద్యార్థులను, నర్సులను ఈ థియేటర్లకు ఆహ్వానించేవారు. వారు కూర్చునేందుకు సీట్లు(Seats) కూడా ఏర్పాటు చేసేవారు. ఫలితంగా ఆ నాటి నుంచి ఇటువంటి గదులకు ఆపరేషన్ థియేటర్(Operation theatre) అనే పేరు వచ్చింది.