రైలు రాగానే లోకో పైలెట్‌కు స్టేషన్ మాస్టర్ ఇనుప రింగ్ ఎందుకిస్తారు? ఇది ఎందుకు ఉపయోగపడుతుందో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-04-23T10:01:24+05:30 IST

భారతీయ రైల్వేలు అత్యంత వేగంగా ఆధునికత వైపు దూసుకుపోతున్నాయి. అయితే నేటికీ రైల్వేలోని కొన్ని విభాగాల్లో...

రైలు రాగానే లోకో పైలెట్‌కు స్టేషన్ మాస్టర్ ఇనుప రింగ్ ఎందుకిస్తారు? ఇది ఎందుకు ఉపయోగపడుతుందో తెలిస్తే...

భారతీయ రైల్వేలు అత్యంత వేగంగా ఆధునికత వైపు దూసుకుపోతున్నాయి. అయితే నేటికీ రైల్వేలోని కొన్ని విభాగాల్లో బ్రిటీష్ కాలం(British period) నాటి సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. వీటిలో టోకెన్ మార్పిడి వ్యవస్థ కూడా ఒకటి. ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాలలో ఈ విధానం అమలవుతోంది.

రైలుకు సంబంధించి సురక్షిత ఆపరేషన్(Safe operation) నిర్ధారించడానికి, టోకెన్ మార్పిడి వ్యవస్థ(Token exchange system) బ్రిటిష్ కాలంలో అమలయ్యింది. గతంలో ట్రాక్ సర్క్యూట్లు(Track circuits) ఉండేవికాదు. అప్పుడు టోకెన్ ఎక్స్ఛేంజ్ సిస్టమ్ ద్వారా మాత్రమే రైలు సురక్షితంగా గమ్యాన్ని చేరుకునేది. ఇంతకుముందు రైల్వేలో సింగిల్ ట్రాక్ మాత్రమే ఉండేది. రెండు వైపుల నుంచి వచ్చే రైళ్లు ఒక ట్రాక్‌పైనే నడిచేవి. అటువంటి పరిస్థితిలో టోకెన్ మార్పిడి వ్యవస్థ ఒక రైలును మరొక రైలు ఢీకొనకుండా ఉండటానికి ఉపయోగపడేది. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

టోకెన్ అంటే ఒక ఇనుప రింగ్(Iron ring). స్టేషన్ మాస్టర్... లోకో పైలట్‌కి దీనిని అందజేస్తాడు. లోకో పైలట్ ఈ టోకెన్‌ను అందుకున్నాడంటే.. తదుపరి స్టేషన్ వరకు లైన్ క్లియర్‌(Clear the line)గా ఉందని, ప్రయాణం కొనసాగించవచ్చని అతనికి సంకేతం తెలియజేసినట్టు. తదుపరి స్టేషన్‌కు చేరుకున్న తర్వాత లోకో పైలట్ ఆ టోకెన్‌ను అక్కడ డిపాజిట్ చేసి, అక్కడి నుంచి మరో టోకెన్‌ తీసుకుని ముందుకు వెళ్తాడు. ఈ ఇనుప రింగ్‌లో ఒక ఇనుప బంతి ఉంటుంది. రైల్వే అధికారులు తమ భాషలో దీనిని టాబ్లెట్ అని పిలుస్తారు.

స్టేషన్‌లో అమర్చిన 'నెయిల్ బాల్ మెషిన్'('Nail Ball Machine')లో ఈ బంతి ఇమిడి ఉంటుంది. నెయిల్ బాల్ మెషీన్లు ప్రతి స్టేషన్‌లోనూ ఉంటాయి. స్టేషన్ మాస్టర్... లోకో పైలట్ నుండి అందుకున్న రింగ్‌లోని బంతిని యంత్రంలోకి చొప్పించినప్పుడు, తదుపరి స్టేషన్‌కు వెళ్లే మార్గం క్లియర్‌గా ఉందని అర్థం.

ఏదైనా కారణాల వల్ల రైలు మధ్యలో ఆగిపోయి, స్టేషన్‌కు లోకో పైలెట్(Loco Pilot) ద్వారా టోకెన్ రాలేదనుకుందాం. అటువంటి పరిస్థితిలో స్టేషన్ మాస్టర్ ఏ రైలునూ ముందుకు వెళ్లనివ్వరు. అయితే ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా 'ట్రాక్ సర్క్యూట్'లను ఉపయోగిస్తున్నారు.

Updated Date - 2023-04-23T10:19:12+05:30 IST