mosquitoes bite: అలాంటి వారి రక్తమంటేనే దోమలకు ఎంతో ఇష్టమట... శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఆశ్చర్యకర వాస్తవాలు!
ABN , First Publish Date - 2023-03-13T07:57:18+05:30 IST
mosquitoes bite: వేసవి వచ్చిందంటే చాలు దోమలు విజృంభించడం మొదలవుతుంది. కొంతమంది దోమలు తమను ఎక్కువగా కుడతాయని చెబుతుంటారు.
mosquitoes bite: వేసవి వచ్చిందంటే చాలు దోమలు విజృంభించడం మొదలవుతుంది. కొంతమంది దోమలు తమను ఎక్కువగా కుడతాయని చెబుతుంటారు. దోమలు(mosquitoes) తమ చుట్టూ ఎక్కువగా తిరుగుతుంటాయని కూడా వారు చెబుతుంటారు. దోమలు కొందరినే ఎక్కువగా ఇబ్బంది పెడుతాయనే దానిలో ఎంత నిజముంది? లేక అది వారి భ్రమ మాత్రమేనా? శాస్త్రవేత్తలు(Scientists) దీని గురించి ఒక అధ్యయనం చేశారు. కొంతమందిని నిజంగా దోమలు అధికంగా ఇబ్బంది పెడతాయని గుర్తించారు.
నిజానికి దోమలను ఆకర్షించేలా కొందరి శరీరం నుంచి ఒక ప్రత్యేకమైన వాసన(Unique smell) వస్తుంది. ఈ అధ్యయనం అనేక పాత నమ్మకాలను తిరగతోడింది. బ్లడ్ గ్రూప్, రక్తంలో చక్కెర పరిమాణం(Blood sugar levels), వెల్లుల్లి, అరటిపండ్లు తినడం లేదా స్త్రీ అయి ఉండటం మొదలైనవి దోమలు అధికంగా కుట్టడానికి కారణమని గతంలో భావించారు.
ఈ తాజా అధ్యయన ఫలితాలు(Study results) సెల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వీటి ప్రకారం చూస్తే దోమలు అనేవి ముఖ్యంగా చర్మంలో కార్బాక్సిలిక్ యాసిడ్(Carboxylic acid) స్థాయి అధికంగా ఉన్న వ్యక్తులకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. పరిశోధకుల అభిప్రాయం(opinion) ప్రకారం మానవ చర్మం(skin) దోమలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అధ్యయనం(study)లో పాల్గొన్నవారి చేత పరిశోధకులు నైలాన్ దుస్తులు ధరింపజేశారు.
ఇటువంటి దుస్తులు ధరించే వారిలో దోమలను ఆకర్షించే కార్బాక్సిలిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు(Researchers) గుర్తించారు. ఇందులో ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉన్నవారివైపు దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతున్నాయని తేలింది.