WhatsApp: వాట్సప్ యూజర్లకు మరో కొత్త సమస్య.. ఈ ఆప్షన్‌ను సెట్ చేసుకోకపోతే అంతే సంగతులు..!

ABN , First Publish Date - 2023-01-03T11:48:54+05:30 IST

సమస్య ఏమీ ఉండదులే అన్నట్టుండే వీటితో ;చాలా..

WhatsApp: వాట్సప్ యూజర్లకు మరో కొత్త సమస్య.. ఈ ఆప్షన్‌ను సెట్ చేసుకోకపోతే అంతే సంగతులు..!

చాటింగ్ కోసం, వీడియో కాల్స్ కోసం ఇతర కమ్యూనికేషన్ కోసం ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్ వాట్సప్. వాట్సప్ లేకుంటే కొందరికి ఏమీ తోచదు. అయితే అందరిలో ఉన్న ఈ బలహీనత హ్యాకర్లకు అడ్వాంటేజ్ అవుతోంది. మొబైల్ హ్యాక్ చెయ్యడానికి ఇప్పుడొక కొత్త మార్గం దొరికింది వారికి. సాధారణంగా హ్యాకర్లు ఫిషింగ్ లను ఉపయోగించి హ్యాక్ చేసేవారు. ఇప్పుడు రూటు మార్చి GIF ల ద్వారా తమ పనిని సులువు చేసుకుంటున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కాదేదీ హ్యాకింగ్ కు అనర్హం అన్నట్టు మారింది వీరి వ్యవహారం. సమస్య ఏమీ ఉండదులే వీటితో అన్నట్టుండే GIF లనే సాధనంగా వాడేసుకుంటున్నారు.

హ్యాకింగ్ ఎలా జరుగుతోందంటే...

సాధారణంగా హ్యాకర్లు ఫిషింగ్ లింక్ లను పంపి హ్యాక్ చేసేవారు. అయితే వాటికి బదులుగా GIF పిక్చర్స్ లోనే ఫిషింగ్ అటాచ్ చేస్తున్నారు. దీన్ని GIFShell అని అంటున్నారు. హ్యాకింగ్ కోసం GIF పిక్చర్ లను హ్యాకర్లు ఉపయోగించినపుడు, పొరపాటున ఎవరైనా ఆ GIF లను డొన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే మొబైల్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల జరగాల్సిన నష్టం మొత్తం జరుగుతుంది. అయితే ఈ తరహా ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వాట్సప్ లో కొన్ని సెట్టింగ్స్ చేయవచ్చు.

ఆటో డౌన్లోడ్ వల్ల చాలా నష్టపోతారు. చాలామంది మొబైల్ లో ఫొటోస్, గిఫ్, వీడియో మొదలయినవి ఆటో డౌన్లోడ్ అవుతుంటాయి. ఈ ఆటో డౌన్లోడ్ ఆఫ్షన్ ను ఆఫ్ చేయడం ద్వారా మన ప్రమేయం లేకుండా ఎలాంటి ఫొటోలు, గిఫ్ లు, వీడియోలు డౌన్లోడ్ కాకుండా అరికట్టవచ్చు. అపరిచితులు పంపేవి ఓపెన్ కాకుండా ఈ సెట్టింగ్ సహాయపడుతుంది. నిజానికి మొబైల్ హ్యాక్ అయ్యి నష్టపోవడానికి కారణం అందరూ ఇటువంటి విషయాలు తేలికగా తీసుకోవడమే, చిన్న చిన్న విషయాలను కొట్టి పడేయకుండా ప్రైవసీ సెక్యూరిటీ సెట్టింగ్స్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి.

Updated Date - 2023-01-03T11:48:56+05:30 IST