Share News

WhatsApp: వాట్సప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్.. తాజాగా వచ్చిన మరో కొత్త అప్‌డేట్ ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-11-29T14:40:02+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం మంది వాట్సాప్ ను వినియోగిస్తుండటం వల్ల దీన్ని ఎప్పటికప్పుడు మెరుగుదిద్దుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడొక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

WhatsApp: వాట్సప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్.. తాజాగా వచ్చిన మరో కొత్త అప్‌డేట్ ఏంటంటే..!

వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం మంది ఉపయోగిస్తున్న యాప్. ప్రతిరోజూ లిమిట్ లేకుండా సందేశాలు పంపుకోవడం, వీడియో కాల్స్, ఫోటోలు పంపుకోవడంతో పాటు ఫైల్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ దగ్గర నుండి వివిధ గ్రూపులు ఏర్పాటు వరకు వాట్సాప్ లో చాలా నడుస్తాయి. ఈ కారణంగానే వాట్సాప్ ను ఎప్పటికప్పుడు కొత్తగా మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడొక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ కారణంగా డెస్క్ టాప్ వినియోగదారులు చాలా ఖుషీగా ఉన్నారు. దీని గురించి తెలుసుకుంటే..

వాట్సప్(Whats App) వినియోగించేవారికి ఈ మధ్యన ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఫోటోలు, వీడియోలు ఒక్కసారి మాత్రమే చూసే అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. మొదట ఈ అప్డేట్ ను డెస్క్ టాప్ లో కూడా ప్రవేశపెట్టారు. కానీ గోప్యతా కారణాల వల్ల దీన్ని తొలగించారు. కేవలం స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఇది పనిచేసేది. కానీ ఇప్పుడు ఈ ఫీచర్ ను మళ్ళీ డెస్క్ టాప్ వినియోగదారులకోసం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు సేమ్ మొబైల్ లో లాగానే ఎవరికైనా ఫోటోలు, స్క్రీన్ షాట్ లు, వీడియోలను వ్యూ వన్స్(View once) ఆప్షన్ తో పంపవచ్చు. అవతలివారు ఒక్కసారి వీక్షించిన తరువాత పంపిన ఫోటో లేదా వీడియో తొలగించబడుతుంది.

ఇది కూడా చదవండి: చలికాలంలో వచ్చే సమస్య ఇదే.. కాళ్లకు ఇలా పగుళ్లు వస్తే..!


కేవలం వ్యూ వన్స్ ఆప్షన్ మాత్రమే కాకుండా వాట్సప్ వినియోగించే వారికి గోప్యతా భద్రతా ఫీచర్(security protection feature)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ వినియోగదారులు తమ ఇ-మెయిల్ ఐడీ(e-mail id) ని వాట్సాప్ అకౌంట్ కు లింక్ చేసుకోవచ్చు. దీని కారణంగా ఎవరైనా వాట్సాప్ ను హ్యాక్ చేస్తే ఆ అకౌంట్ తిరిగి పొందెందుకు ఆరు అంకెల కోడ్(6 number code) ను మొబైల్ నెంబర్ కు కాకుండా ఇ-మెయిల్ ఐడీ కి పంపబడుతుంది. నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా లేకపోయినా సరే ఇది SMS ద్వారా ధృవీకరణ కోడ్ ను సమయానికి స్వీకరించలేనప్పుడు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

ఇది కూడా చదవండి: Buying Vegetables: వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి కొంటున్నారా..? అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది..!


Updated Date - 2023-11-29T14:40:05+05:30 IST