Aadhaar Card: సెప్టెంబర్ 30వ తారీఖే ఆఖరు తేదీ.. మరో 10 రోజుల్లో ఈ పని చేయకపోతే ఆ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్..!

ABN , First Publish Date - 2023-09-19T20:37:08+05:30 IST

మీరు పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, ఎస్‌సీఎస్‌ఎస్ వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడులు పెడుతున్నారా? మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ అయ్యాయా? ఈ నెలాఖరు లోపు మీ ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఆ ఖాతాలు ఫ్రీజ్ అయిపోయే ప్రమాదం ఉంది. అంటే గడువు ఇంకా కేవలం పది రోజులు మాత్రమే ఉంది.

Aadhaar Card: సెప్టెంబర్ 30వ తారీఖే ఆఖరు తేదీ.. మరో 10 రోజుల్లో ఈ పని చేయకపోతే ఆ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్..!

మీరు పీపీఎఫ్ (Public Provident Fund), ఎన్‌ఎస్‌సీ (National Savings Certificate), ఎస్‌సీఎస్‌ఎస్ (Senior Citizen Savings Scheme) వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడులు పెడుతున్నారా? మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ (Pan-Aadhaar Link) అయ్యాయా? ఈ నెలాఖరు లోపు మీ ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఆ ఖాతాలు ఫ్రీజ్ అయిపోయే ప్రమాదం ఉంది. అంటే గడువు ఇంకా కేవలం పది రోజులు మాత్రమే ఉంది. ఆ లోపు పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఆ ఖాతాలు (Freeze) నిలిచిపోతాయి.

పైన పేర్కొన్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌ (Small Savings Scheme)తో పాటు పోస్టాఫీస్‌ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు తప్పనిసరిగా ఒకసారి తమ పాన్, ఆధార్ లింక్ అయి ఉన్నాయో, లేదో ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ అవకపోతే మరో పది రోజుల్లో ఆ పని పూర్తి చేయాలి. లేకపోతే ఆయా ఖతాలు ఫ్రీజ్ అయిపోతాయి. ఆ కాలానికి ఆయా స్కీమ్‌ల ద్వారా రావాల్సిన వడ్డీ జమ కాదు. అలాగే వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా పరిమితులు ఉంటాయి. మెచ్యూర్ అయిన మొత్తం పెట్టుబడిదారుడి ఖాతాలో జమ కాదు.

Crocodile vs Buffalo: నరాలు తెగే ఉత్కంఠ.. నది ఒడ్డున నీళ్లు తాగుతున్న దున్నపోతుపై మొసలి అటాక్.. చివరకు..!

బ్యాంకు ఖాతాలు ఉన్న వారందరూ పాన్, ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పట్నుంచో చెబుతూ వస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు గడువు తేదీలు పొడిగించుకుంటూ వెళ్లింది. అయినా చాలా మంది పాన్, ఆధార్ లింక్ చేయించుకోలేదు. దీంతో గడువు ముగిసిన తర్వాత కూడా జరిమానాతో లింక్ చేసుకునే అవకాశం కల్పించింది.

Updated Date - 2023-09-19T20:37:08+05:30 IST