Water dogs: అంకసముద్రం చెరువులో ఆకట్టుకుంటున్న నీటి కుక్కలు..

ABN , First Publish Date - 2023-08-13T12:08:21+05:30 IST

విజయనగర జిల్లా పరిధిలోని హగరిబొమ్మనహళ్ళి తాలూకా అంకసముద్రం ప్రాంతాన్ని పక్షి సంరక్షిత ప్రాంతానికి కేటాయించారు. తుంగభద్ర

Water dogs: అంకసముద్రం చెరువులో ఆకట్టుకుంటున్న నీటి కుక్కలు..

బళ్లారి(బెంగళూరు): విజయనగర జిల్లా పరిధిలోని హగరిబొమ్మనహళ్ళి తాలూకా అంకసముద్రం ప్రాంతాన్ని పక్షి సంరక్షిత ప్రాంతానికి కేటాయించారు. తుంగభద్ర జలాశయానికి అధికి ప్ర మాణంలో వరద నీరువచ్చి చేరుతుండడంతో అంకసముద్రం ప్రాంతంలో తుంగభద్ర జలాశయం బ్యాక్‌ వాటర్‌లో నీటికుక్కలు(Water dogs) స్వైర విహారం చేస్తున్నాయి. పక్షిదామం తిలకించడానికి వచ్చిన పర్యాటకులు అంక సముద్రం ప్రాంతంలో బ్యాక్‌వాటర్‌లో నీటి కుక్కలు స్వైర విహారం ఎంతగానో ఆకట్టుకుంది. తుంగభద్ర బ్యాక్‌ వాటర్‌లో నివసించే నీటి కుక్కలకు ఇక్కడ అసవరమైన చేపలను వెతుక్కుంటూ వచ్చినట్లు పక్షి ప్రేమికుడు విజయకుమార్‌ అభిప్రాయ పడుతున్నారు. నది, చెరువుల మధ్య 500 మీటర్ల దూరం ఉంది. నది నుండి చెరువుకు దారి కనుకున్న నీటి కుక్కలు చెరువులో చేరి ఉంటాయని స్థానికులు అభిప్రాయ పడుతుంటారు. సంవత్సరం పాటు చెరువులో నీరు ఉండేలా నది నుంచి చెరువుకు పంప్‌ చేసి చెరువులో నీటిని ఉండే చూస్తుంటారు.

అంక సముద్రంలో ఇపుడిపుడే దేశంలో వివిధ ప్రాంతాల నుండి వాటి సంతానోత్పత్తికి ప్రతి యేటా ఇక్కడికి వచ్చి వెళుతున్నట్లు స్థానికులు చెబుతుంటారు. ఏటా 140కిపైగా పక్షల రకాలు ఇక్కడ బస చేస్తుంటాయని పక్షి ప్రేమికులు వెల్లడిస్తున్నారు. అంకసముద్రం చెరువులో క్యాట్‌ఫిష్‌లు ఎక్కువగా నివసిస్తుండడం వలన చెరువులో దిగడానికి ఎవరూ సాహసించరు. నీటి కుక్కలకు క్యాఫ్‌ ఫిష్‌ అత్యంత ప్రీతికరమైన తిండి కావడంతో చెరువులో క్యాట్‌ ఫిష్‌లను నీటి కుక్కలు తినడంతో అంకసముద్రం చెరువులో క్యాట్‌ ఫిష్‌లు తగ్గుతాయని పక్షి ప్రేమికుడు విజయ్‌ కుమార్‌ అభిప్రాయపడుతున్నారు.

pandu5.2.jpg

Updated Date - 2023-08-13T12:08:21+05:30 IST