Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

ABN , First Publish Date - 2023-03-03T18:33:04+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాలో.. ‘రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్’ అనే డైలాగ్ ఉంటుంది. అది నిజమనే

Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్
Megastar Chiranjeevi In Waltair Veerayya

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాలో.. ‘రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్’ అనే డైలాగ్ ఉంటుంది. అది నిజమనే విషయం అందరికీ తెలిసిందే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే.. మరోసారి ఈ సినిమా 50 రోజుల సెంటర్స్ చెక్ చేసుకోండి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 50 రోజులు ఒక సినిమా థియేటర్లలో నిలబడటం అనేది గగనంగా మారింది. అలాంటిది వీరయ్య ఏకంగా 115 సెంటర్లలో 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసినా కూడా.. చాలా చోట్ల ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుండటం చూస్తుంటే.. ఇది చిరంజీవి స్టామినా అంటూ ఫ్యాన్స్ కాలర్స్ ఎగరేస్తున్నారు. (Waltair Veerayya 50 Days Centers)

మెగాస్టార్ చిరంజీవితో కలిసి మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం.. ఇప్పటికే టాలీవుడ్‌ (Tollywood)లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సంక్రాంతి (Sankranthi) కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు.. రోజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఈరోజు (మార్చి 03)తో 70 డైరెక్ట్ సెంటర్లలో, ఓవరాల్‌గా 115 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇది ఖచ్చితంగా గొప్ప విజయమే, ఏ సినిమా అయినా ప్రస్తుతం లాంగ్ రన్ ఇవ్వడం ఛాలెంజింగ్ టాస్క్. ఆ టాస్క్‌ని మెగాస్టార్ సునాయాసంగా పూర్తి చేశారు.

దర్శకుడు బాబీ (Bobby).. ఇందులో వింటేజ్ మెగాస్టార్‌ని చూపించడంతో పాటు, రవితేజను ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ప్రజంట్ చేసి అందరి మనసుని గెలిచుకున్నాడు. ఇందులో చిరంజీవి సరసన శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందించారు.


ఇవి కూడా చదవండి:

*********************************

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Updated Date - 2023-03-03T18:38:35+05:30 IST