PavitraNaresh: ఆ లిప్ లాక్ నరేష్ బయోపిక్ సినిమాలోది

ABN , First Publish Date - 2023-01-16T13:53:18+05:30 IST

ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, నరేష్ జీవితం ఆధారంగా ఒక సినిమా నిర్మింపబడుతోంది అని, అది షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలిసింది.

PavitraNaresh: ఆ లిప్ లాక్ నరేష్ బయోపిక్ సినిమాలోది
A still from the video released by VK Naresh

నరేష్, పవిత్ర కలిసి 2022 డిసెంబర్ 31 వ తేదీన ఒక చిన్న వీడియో విడుదల చేశారు. ఐడి నరేష్ తన సాంఘీక మాధ్యమం అయిన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ((#PavitraNaresh releases a small video on December 31) ఆ చిన్న వీడియో లో నరేష్, పవిత్ర గాఢ చుంబనంతో కనపడతారు, అలాగే కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు చెపుతూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని ఆంగ్లం లో వేస్తారు. ఈ వీడియో వైరల్ అయింది అప్పుడు, అదొక బ్రేకింగ్ న్యూస్ అయింది కూడా. (#PavitraNaresh announced that they are getting married soon in that video)

అయితే ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఆమధ్య నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ తమ విడాకుల కేసు కోర్లులో ఇంకా ఉందని, నరేష్ కి అది తెలుసు అని, అందుకని అతను అంత ఓపెన్ గా పెళ్లి చేసుకుంటున్నాం అని వీడియో తయారు చేసి సాంఘీక మాధ్యమం లో పెట్టడు అని అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే ఆమె చెప్పిందే నూటికి నూరు శాతం కరెక్టు అని తెలుస్తోంది, ఇప్పుడు బయటకి వచ్చిన ఒక వార్త ప్రకారం తెలిసింది.

pavitra-naresh1.jpg

ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, నరేష్ జీవితం ఆధారంగా ఒక సినిమా నిర్మింపబడుతోంది అని, అది షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలిసింది. (The breaking news is that a film is making on the life of Naresh) ఇప్పుడు విడుదల చేసిన ఈ చిన్న వీడియో కూడా ఆ సినిమా నుండే నిర్మింప బడిందని ఒక సోర్స్ ద్వారా తెలిసింది. దీనికి ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్సకత్వం వహిస్తున్నారని కూడా తెలిసింది. (Popular producer and director MS Raju is directing this biopic of Naresh) ఇందులో నరేష్ తన పెళ్లిళ్లు గురించి కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆసక్తికర అంశం ఏంటి అంటే, నరేష్, పవిత్ర పాత్రల్లో వాళ్ళే కనపడతారు. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్రకోసమని పాత కథానాయిక మంజుల విజయకుమార్ ల పెద్ద కుమార్తె వనితని తీసుకున్నట్టుగా తెలిసింది. (Vanitha Vijaykumar, daughter of yesteryear actress Manjula and Vijaykumar, is portraying Naresh's third wife #RamyaRaghupathi, says a source) ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసమని వనిత హైదరాబాద్ వచ్చినట్టుగా కూడా తెలిసింది. (Presently the shooting of this biopic is going on in Hyderabad)

pavitra-naresh2.jpg

అయితే నరేష్ తన బయోపిక్ తాను ఎందుకు తీసుకుంటున్నాడు అంటే, తన గురించి తాను ఎంత మంచివాడో ప్రపంచానికి ఈ సినిమా ద్వారా చాటి చెప్పాలని అనుకుంటున్నాడు అని ఒక యూనిట్ సభ్యుడు చెప్పాడు. అలాగే ఈ సినిమాలో తన మూడో భార్య రమ్య రఘుపతి పాత్రని చాలా చెడ్డదానిగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. (Naresh is going to portray his third wife in a more negative way in his biopic, added the source) మిగతా పాత్రలో చిన్న చిన్న నటుల్ని కూడా పెడుతూ ఈ సినిమా త్వరగా పూర్తి చెయ్యడానికి చూస్తున్నారని కూడా తెలిసింది. అందులో నరేష్ తన మూడో భార్య మీద ఎటువంటి ఆరోపణలు చేసాడో వాళ్ళ పాత్రలని ఈ సినిమాలో చూపిస్తున్నటుగా తెలిసింది. ఒక టి.వి. ఛానెల్ సి.ఈ.ఓ. పాత్ర, అలాగే ఇంకా చాల వివాదాస్పద పాత్రలు కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలిసింది. (He also roped in a small actor to play a CEO of a Bangalore based TV channel in this film)

ఇదే సినిమాలో పవిత్ర, నరేష్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెప్తారని, అదే వీడియోని డిసెంబర్ 31న విడుదల చేసినట్టుగా కూడా తెలిసింది. (In this film #PavitraNaresh both announces their marriage and the same video they leaked on December 31, added the source) ఈ బయోపిక్ కి అయిన మొత్తం బడ్జెట్ నరేష్ పెడుతున్నట్టుగా కూడా తెలిసింది. నరేష్ దగ్గర కావలసినంత డబ్బులున్నాయి, అవి అతను తన కొడుకు కెరీర్ కోసం ఉపయోగించకపోయినా తన ప్రచారం కోసం, తను మంచివాడు అని చెప్పుకోవటం కోసం ఉపయోగించుకుంటున్నాడు అని చిత్ర పరిశ్రమలో పేరు చెప్పని ఒక దర్శకుడు చెప్పాడు. (Naresh is producing this film and he is putting lot of money on it)

pavitra-naresh3.jpg

అయితే ఇప్పుడు తీస్తున్న ఈ నరేష్ బయోపిక్ థియేటర్ లో విడుదల చేస్తారా, లేక ఓ.టి.టి కి ఇస్తారా అన్నది ఇంకా తెలియరాలేదు. ఎం.ఎస్. రాజు ఈమధ్య 'డర్టీ హరి' (#DirtyHari), 'సెవెన్ డేస్ సిక్స్ నైట్స్' (#SevenDaysSixNights) అని ఒక రెండు శృంగార భరితమయిన సినిమాలు తీశారు. ఇప్పుడు నరేష్ బయోపిక్ కూడా తీస్తున్నారని ఇందులో నరేష్, పవిత్ర ఎలా గాఢ చుంబనం చేసుకున్నారో, అలాగే నరేష్ మూడో భార్య ఒక టి.వి. ఛానల్ సి.ఈ.ఓ. తో కూడా అలాగే చేయించాలని చూస్తున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా నరేష్ మంచివాడు అని చెప్పడానికా, లేక తాను వొదిలేయ దలుచుకున్న భార్య చెడ్డది అని చెప్పడానికా, దేనికి తీస్తున్నట్టో తెలీదు అని ఒక యూనిట్ సభ్యుడు వ్యాఖ్యానించాడు.

Updated Date - 2023-01-16T13:58:26+05:30 IST