Share News

Viral Video: కారుకు ఎదురెళ్లి మరీ.. సైకిల్‌పై ఓ వ్యక్తి రిస్కీ స్టంట్స్.. నడిరోడ్డుపై పిచ్చి వేషాలేస్తే ఇలాగే జరుగుతుందిగా..!

ABN , First Publish Date - 2023-10-26T14:57:06+05:30 IST

రిస్క్ చేయడమంటే ఇప్పటి కుర్రాళ్ళకు ఎక్కడలేని సరదా. నడిరోడ్డు మీద ఓ కుర్రాడు స్టంట్ చేస్తుంటే అందరూ షాకయ్యారు కానీ చివరికి జరిగింది ఇదీ..

Viral Video: కారుకు ఎదురెళ్లి మరీ.. సైకిల్‌పై ఓ వ్యక్తి రిస్కీ స్టంట్స్.. నడిరోడ్డుపై పిచ్చి వేషాలేస్తే ఇలాగే జరుగుతుందిగా..!

రిస్క్ చేయడమంటే ఇప్పటి కుర్రాళ్ళకు ఎక్కడలేని సరదా. నడిరోడ్డు మీద సాహసాలు చేస్తున్నప్పుడు అందరూ గుడ్లప్పగించి, గుండెల మీద చేతులు వేసుకుంటూ ఉంటే ఆ కిక్కే వేరు. ఇలాంటి ఫీల్ కోసం ఎంత ప్రమాదకరమైన స్టంట్లు అయినా చేస్తుంటారు. పైపెచ్చు సోషల్ మీడియాలో వైరల్ కావడమనే ఆశ ఎలాగో ఉంటుంది. ఇదే కోవలో ఓ కుర్రాడు వేగంగా వస్తున్న కారుకు ఎదురు వెళ్ళి మరీ రిస్కీ స్టంట్లు చేశాడు. కానీ అతను చేసిన వెర్రి పనికి అక్కడికక్కడే ఫలితం అనుభవించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'అలాంటి పిచ్చి వేషాలేస్తే ఇలా కాకుండా ఇంకెలా జరుగుతుంది?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ప్రమాదకరమైన విన్యాసాలు(dangerous stunts) చేయాలని చాలామంది కుతూహలంతో ఉంటారు. ఈ విషయంలో అబ్బాయిలే ఎక్కువ రిస్క్ చేస్తారు. ప్రమాదకరమైన స్టంట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంటాయి. వీడియోలో ఓ కుర్రాడు రహదారి మీద సైకిల్ పై స్టంట్లు(stunts on bicycle) చేయడం చూడచ్చు. అతను చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని చాలా వేగంగా సైకిల్ తొక్కుతూ ఎదురుగా వేగంగా వస్తున్న కారు ముందుకు వెళ్లాడు. కారు ముందుకు వెళ్లగానే సైకిల్ ముందు చక్రాన్ని పైకి లేపి కారును గుద్దకుండా తప్పించుకోవాలన్నది అతని ఆలోచన. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. వేగంగా వస్తున్న కారు ముందుకు వెళ్లిన అతను సైకిల్ ముందు చక్రాన్ని పైకి లేపి తప్పించుకున్నాడు. కానీ పక్కకు తప్పించిన సైకిల్ ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. దీంతో అతను కూడా పల్టీ కొడుతూ ముందుకెళ్లి పడ్డాడు. ఈ సంఘటనను చుట్టుప్రక్కల అందరూ చాలా షాకవుతూ చూశారు. ఆ వ్యక్తి పల్టీ కొడుతూ ముందుకెళ్లి పడినా అతనికి పెద్ద ప్రమాదమైతే జరగలేదు. పడిన వెంటనే ఒక చేతిని మరొకచేత్తో రుద్దుకుంటూ లేచి వెళ్లిపోయాడు. దీన్ని బట్టి అతనికి పెద్ద ప్రమాదం జరగలేదని, చేతులకు గాయాలు అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

Viral Video: కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరగడాన్ని ఎక్కడైనా చూశారా..? ఈ కుర్రాడు పెద్ద అద్భుతమే చేసేశాడు..!



ఈ వీడియోను Crazy Clips అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఈ వ్యక్తి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'అసలు ఇలాంటి స్టంట్లు చేయవలసిన అవసరం ఏంటో అర్థమే కాదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది, ఒకవేళ పెద్ద ప్రమాదం జరిగుంటే అప్పుడు పరిస్థితేంటి?' అని మరొకరు అన్నారు. 'చేతులారా ప్రాణాలమీదకు కొనితెచ్చుకుంటారు కొందరు, ఇతనూ అలాంటి వాడే' అని ఇంకొకరు అన్నారు.

Health Tips: వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు.. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..!


Updated Date - 2023-10-26T15:08:27+05:30 IST