Viral Video: ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి.. ఈ యువతికి వరుసగా మూడు సార్లు ముక్కు పగిలిపోయిందిగా.. అద్దాలున్నాయని తెలియక..!

ABN , First Publish Date - 2023-04-16T16:56:42+05:30 IST

ముఖ్యంగా మొబైల్ చూసుకుంటూనో, ఎవరితో అయినా మాట్లాడుతూనో నడుస్తున్నప్పుడు ఈ గ్లాసుల పుణ్యమా అని ముఖం పగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడూ ఓ అమ్మాయికి అలాగే జరిగింది. అదేదో ఒకటి రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు ముక్కు పగిలిపోయింది.

Viral Video: ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి.. ఈ యువతికి వరుసగా మూడు సార్లు ముక్కు పగిలిపోయిందిగా.. అద్దాలున్నాయని తెలియక..!

షాపింగ్ మాల్స్ లోనూ, కార్పోరేట్ సంస్థల్లోనూ చాలావరకు క్లిస్టర్ క్లియర్ గ్లాసెస్(cluster clear glasses) ఉంటాయి. ఈ గ్లాసెస్ వల్ల బయటకు వెళ్ళే దారి ఎక్కడుందో కొత్తవాళ్ళు అంత ఈజీగా కనుక్కోలేరు. మరీ ముఖ్యంగా మొబైల్ చూసుకుంటూనో, ఎవరితో అయినా మాట్లాడుతూనో నడుస్తున్నప్పుడు ఈ గ్లాసుల పుణ్యమా అని ముఖం పగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడూ ఓ అమ్మాయికి అలాగే జరిగింది. అదేదో ఒకటి రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు ముక్కు పగిలిపోయింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'అయ్యో పాపం' అని అంటున్నారు. ఈ వీడియో గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుంటే..

ఇంటి తలుపుల గుండా బయటకు వెళ్ళాలంటే పెద్ద సమస్య ఉండదు. కానీ ఎక్కువ భాగం గ్లాసెస్ తో రూపొందించిన బిల్డింగ్లు, షాపింగ్ మాల్స్, కార్పోరేట్ సంస్థలలో చాలా మంది కన్ఫ్యూజ్(confuse) అయిపోతుంటారు. ఓ అమ్మాయి అలాగే కన్ఫ్యూజ్ అయ్యింది. పాపం తను ఎక్సిట్ డోర్(exit door) గుండా బయటకు వెళ్ళాలని అనుకుంది. అయితే ఎక్సిట్ డోర్ కు ఇరువైపులా మొత్తం గ్లాసెస్ ఏర్పాటు చేశారు. అవి కూడా చాలా స్పష్టంగా క్లిస్టర్ క్లియర్ గా ఉన్నాయి. చూడటానికి ఎక్సిట్ డోర్ లాగే అనిపిస్తున్నాయి. దాంతో అమ్మాయి ఇదిగో ఇదే బయటకు వెళ్లే దారి అనుకుని అటువైపు కదిలింది. పాపం అక్కడ ఎలాంటి దారి లేదు, కానీ ఆ అమ్మాయి వేగంగా అటువైపు వెళ్ళడంతో చాలా స్పీడ్ గా వెళ్లి అద్దానికి గుద్దుకుంది. ఇంకేముంది ఆమె ముక్కు పగిలింది. పాపం ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని బాధపడుతూ 'అయ్యో దారి ఇక్కడ కాదు పక్కన ఉందనుకుంటా' అని మళ్లీ పక్కకు వెళ్ళింది. కానీ పక్కన కూడా సేమ్ అద్దమే ఉండటంతో రెండోసారి కూడా ముక్కు పగిలింది. మళ్ళీ ముక్కును ముఖాన్ని ఓదార్చుకుంటూ పక్కన కనిపిస్తున్న దారివైపు వెళ్ళగా అక్కడ కూడా అద్దమే ఉండటంతో మళ్ళీ ముక్కు పగిలింది. ఇలా వరుసగా మూడుసార్లు ముక్కు పగిలిన(nose blast) తరువాత ఆమెకు బయటకు వెళ్లే దారి దొరికింది.

Viral News: మీ తెలివికి ఓ చిన్న పరీక్ష.. ఈ ట్రేలో ఎన్ని గుడ్లు ఉన్నాయో లెక్క పెట్టగలరా..? సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు..!


షాపింగ్ మాల్ లో సీసీకెమెరాలో(cc camera) ఇదంతా రికార్డ్ అయ్యింది. cctv ediots అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'అయ్యో పాపం' అని అంటున్నారు. 'చూడటానికి ఫన్నీగా అనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి ఎంత భాధపడి ఉంటుందో' అని ఆమె మీద జాలిపడుతున్నారు. 'అంత తొందరపాటు ఎందుకు కాస్త ముందువెనుకా ఆలోచించి, చూసుకుని వెళ్ళచ్చుగా' అని మరికొందరు అన్నారు. 'ఆమె పక్కవాళ్ళ వైపు కాకుండా ముందున్న దారివైపు చూసి నడిచి ఉంటే మూడుసార్లు ముక్కు పగిలేది కాదు' అని మరికొందరు అన్నారు.

Husband: రాత్రి 3 గంటలు.. రోడ్డుపక్కన కారును ఆపమన్న భార్య.. మూత్ర విసర్జనకు వెళ్లి తిరిగొచ్చే లోపే మర్చిపోయి వెళ్లిపోయిన భర్త..!


Updated Date - 2023-04-16T16:56:42+05:30 IST