Share News

Viral: ఓవైపు వందేభారత్ రైళ్లు..మరోవైపు ఇలాంటి దారుణాలా? జనాల్లో ఆగ్రహం! అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-10-19T17:51:46+05:30 IST

ఎల్‌టీటీ మ్యాడ్గావ్ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీ కారులో ఎలుకలు ప్రయాణికుల ఆహారాని తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, ఐఆర్‌సీటీసీ స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Viral: ఓవైపు వందేభారత్ రైళ్లు..మరోవైపు ఇలాంటి దారుణాలా? జనాల్లో ఆగ్రహం! అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణం అంటే ఇష్టపడని వారు ఉండరు! కిటికీ పక్కను కూర్చుని బయట దృశ్యాలను చూస్తూ చేసే ప్రయాణం జీవితకాలానికి సరిపడా గుర్తుల్ని మిగులుస్తుంది. అందుకే చాలా మంది ఎక్కడికైనా సరే రైల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. ఇదంతా నాణేనికి ఓవైపు అయితే, కొందరికి రైళ్లల్లోని అపరిశుభ్ర వాతావరణం, కలుషిత ఆహారం ఆవేదన కలిగిస్తుంటాయి. మునుపటితో పోలిస్తే పరిస్థితులు కొంత మెరుగుపడిగా అప్పుడప్పుడూ వైరల్ అయ్యే కొన్ని వీడియో జనాలను మళ్లీ నైరాశ్యంలోకి నెట్టేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో(Viral Video) ప్రస్తుతం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.

Viral: గుండెనొప్పి అంటూ ఛాతిపట్టుకుని పడిపోయిన కస్టమర్.. అంబులెన్స్ పిలవకుండా మొండికేసిన రెస్టారెంట్ సిబ్బంది.. పోలీసులు వచ్చి చూస్తే..

ఎల్‌టీటీ-మాగ్డావ్ గోవా ఎక్స్‌ప్రెస్ రైల్లోని ఓ ప్యాంట్రీలో(Pantry car) కనిపించిన జుగుప్సాకరమైన దృశ్యం ఇది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ప్యాంట్రీలో కొన్ని ఎలుకలు అక్కడున్న గిన్నెలపై పడి తెగ తినేస్తున్నాయి. ప్రయాణికులకు అందించాల్సిన ఆహారాన్ని అవి ఎంజాయ్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. కొన్ని గిన్నెల్లో పడి మేస్తుంటే మరికొన్ని అక్కడ టేబుళ్లపై అడ్డూఅదుపూ లేకుండా అటూ ఇటూ తిరిగాయి.(Video Shows Rats Eating Food Meant For Passengers Allegedly On LTT-Madgaon Express).

Viral: ఇలాంటి కోతి భూప్రపంచంలో మరోటి ఉండదేమో? తాసీల్దార్ ఆఫీసులోకి ఫైళ్లు కనిపించగానే..


ముంబై మ్యాటర్స్ అనే అకౌంట్లో ఈ వీడియో తొలిసారిగా కనిపించింది. ‘‘వీడియో చూడండి.. ఇది ఓ కొత్త ప్రాజెక్టు, ప్రయాణికులకు ఇచ్చే ఆహారాన్ని ముందుగా రుచి చూసేందుకు ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ ఎలకలన్నీ అదే పనిచేస్తున్నాయి’’ అంటూ ఓ సరదా వ్యాఖ్యను కూడా జత చేశారు. కాగా, ఈ వీడియో తీసిన వ్యక్తి తాను తొలుత రైల్వే కానిస్టేబుల్‌కు ఫిర్యాదు చేశానని చెప్పాడు. రైలు కింద సుమారు ఓ 400-500 ఎలుకలు ఉన్నాయని, ఓ నాలుగైదు రైల్లోకి ఎక్కితే ఏమైందని అతడు తనను ఎదురు ప్రశ్నించినట్టు చెప్పుకొచ్చాడు. దీంతో, తనకు మరింత చిర్రెత్తుకొచ్చి అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయన ప్యాంట్రీ మేనేజర్‌కు సమాచారం అందించాడని చెప్పుకొచ్చాడు. అక్కడ ఎలుకలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని తాము మాత్రం ఏం చేయగలమని ప్యాంట్రీ మేనేజర్ కూడా నిస్సహాయత వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో అతడు రైల్ మదద్ యాప్‌లో పిర్యాదు చేయడంతో ఐఆర్‌సీటీసీపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపాడు.

Viral: వధువుకు దారుణ అనుభవం.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు వరుడితో కలిసి వెళితే..

ఇది చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కేంద్రం వందేభారత్ లాంటి అత్యాధునిక సౌకర్యాలున్న రైళ్లు ప్రవేశపెడుతుంటే మరో వైపు ఇలాంటి దృశ్యాలు నైరాశ్యం కలిగిస్తున్నాయంటూ కొందరు కామెంట్ చేశారు. వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, తగు దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Viral video: రాళ్ల కింద వింత జీవి.. తళతళ మెరుస్తున్న దాని కళ్లు చూసి జనాలు షాక్!

Updated Date - 2023-10-19T17:55:58+05:30 IST