Share News

Viral: ఇలాంటి కోతి భూప్రపంచంలో మరోటి ఉండదేమో? తాసీల్దార్ ఆఫీసులోకి ఫైళ్లు కనిపించగానే..

ABN , First Publish Date - 2023-10-15T18:55:55+05:30 IST

తాసీల్దార్ ఆఫీసులో ఓ కోతి ఫైళ్లు తిరగేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ఇలాంటి కోతి భూప్రపంచంలో మరోటి ఉండదేమో? తాసీల్దార్ ఆఫీసులోకి ఫైళ్లు కనిపించగానే..

ఇంటర్నెట్ డెస్క్: ఎవరైనా అతిగా అల్లరి చేస్తే కోతి చేష్టలు మానాలని కోపగించుకుంటాం! కానీ నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ కోతిని చూసి మాత్రం జనాలు తాము కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. దాని తీరుకు ఆశ్చర్యపోతున్నారు. వీడియోను తెలిసిన వారికి, స్నేహితులు, బంధువులకు ఫార్వర్డ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో(Uttarpradesh) తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: రోడ్డుపై అడ్డంగా పాము..దాని పడగకు తగిలేలా తూపాకీతో కాల్చిన వ్యక్తి.. గురి తప్పడంతో..

Viral Video: ప్రాణాలకు తెగించి తోబుట్టువులను కాపాడిన టీనేజ్ మగ సింహం..ఇప్పుడే ఇలా ఉందంటే..

ఇంతకీ వీడియోలో ఏముందంటే.. సహారన్‌పూర్‌లోని(Saharanpur) ఓ తాసీల్దార్ ఆఫీసులోకి కోతి ఇటీవల అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చింది. కోతి రావడంతో అక్కడి వారందరూ దాన్ని వెళ్లగొట్టేందుకు అప్రమత్తమయ్యారు. కానీ, అంతలోనే కోతి ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. ఎదురుగా కనిపిస్తున్న కొన్ని ఫైళ్ల వద్దకు వెళ్లి కూర్చుని వాటిని తిరగేయడం ప్రారంభించింది(monkey gets busy looking into files in tehsil office). ఏదో భారీ బాధ్యత తనపై ఉన్నట్టు ఒక్కో కాగితాన్ని తిరగేస్తు ఫుల్ బిజీ అయిపోయింది.


Viral Video: భర్తతో రొమాంటిక్ ట్రిప్‌పై వెళ్లిన మహిళ.. రైల్లో ప్రయాణిస్తుండగా షాకింగ్ సీన్..వీడియో రికార్డు చేసి నెట్టింట షేర్ చేస్తే..

ఇదంతా చూస్తూ ఉన్నవారికి అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. ఇంతలో పక్కనే ఉన్న సిబ్బంది ఒకరు దాని ముందు ఓ అరటి పండుపెట్టారు. సాధారణంగా అయితే, అరటిపండును చూడగానే కోతి దాని పుచ్చుకుని అక్కడి నుంచి జంపైపోవాలి. కానీ ఈ సీన్‌లో మాత్రం కోతి పండును పట్టించుకోకుండా తన మానన తాను ఫైళ్లు తిరగేయడంలో పడిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందనేది మాత్రం తెలియరానప్పటికీ నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral: ఇంటి పనుల్లో భార్యకు సాయం చేయనన్న వ్యక్తిపై ప్రశంసల వర్షం.. ఇతడి లాజిక్‌కు జనాలు ఫిదా!

ఇదంతా చూసి జనాలు పడపడీ నవ్వుకుంటున్నారు. కోతికి అరటి పండు లంచంగా ఇచ్చినా కూడా తన బాధ్యత గుర్తెరిగి నడుచుకుందంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. దీనికే ఆ జాబ్ ఇచ్చేస్తే పోలా.. బాధ్యతగా నడుచుకునేటట్టు ఉంది అంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్‌గా(Viral Video) మారింది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2023-10-15T18:59:33+05:30 IST