Share News

Viral Video: భర్తతో రొమాంటిక్ ట్రిప్‌పై వెళ్లిన మహిళ.. రైల్లో ప్రయాణిస్తుండగా షాకింగ్ సీన్..వీడియో రికార్డు చేసి నెట్టింట షేర్ చేస్తే..

ABN , First Publish Date - 2023-10-14T19:39:35+05:30 IST

భర్తతో సరదాగా గడిపేందుకు ఓ రోమాంటిక్ పర్యటనకు వెళ్లిన ఓ అమెరికా మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. కొలరాడోలో ఆమె రైల్లో ప్రయాణిస్తూ కిటికీలోంచి బయటకు చూస్తున్న తరుణంలో కంటపడిన దృశ్యం ఆమెను షాక్‌కు గురి చేసింది.

Viral Video: భర్తతో రొమాంటిక్ ట్రిప్‌పై వెళ్లిన మహిళ.. రైల్లో ప్రయాణిస్తుండగా షాకింగ్ సీన్..వీడియో రికార్డు చేసి నెట్టింట షేర్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: భర్తతో సరదాగా గడిపేందుకు ఓ రోమాంటిక్ పర్యటనకు వెళ్లిన ఓ అమెరికా మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. కొలరాడోలో ఆమె రైల్లో ప్రయాణిస్తూ కిటికీలోంచి బయటకు చూస్తున్న తరుణంలో కంటపడిన దృశ్యం ఆమెను షాక్‌కు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఆమె నెట్టింట్ పెట్టడంతో అది వైరల్‌గా(Viral video) మారింది. వీడియో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Viral: రాత్రివేళ లిఫ్ట్ కోసం బతిమాలిన మహిళ.. వద్దనుకుంటూనే ఆమెను కారులో ఎక్కించుకున్న వ్యాపారి..చివరకు..

పూర్తి వివరాల్లోకి వెళితే, షానన్ ఆమె భర్తకు పెళ్లై ఇటీవలే పదేళ్లు పూర్తయ్యింది. దీంతో, వారు సరదాగా గడిపేందుకు కొలరాడో టూర్ ప్లా్న్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారు డురాంగో నుంచి సిల్వర్‌టన్ వరకూ రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు చుట్టపక్కల కొండలు, వనాలు ఎంజాయ్ చేస్తుండగా ఓ అసాధారణ దృశ్యం కనిపించింది(Us women sees bigfoot in colarod during romatic getaway with husband).

Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..


దాదాపు ఏడు అడుగుల ఎత్తుతో మనషిలా నడుస్తున్న ఓ జీవి వారి కంట పడింది. ఒళ్లంతా బొచ్చుతో నిండిని ఆ జీవిని చూసి వారు ఆశ్చర్యపోయారు. అది ఒళ్లంతా బొచ్చుతో ఉంది. కానీ, వాటి రంగు మాత్రం పరిసరాల్లో కలిసిపోయేలా ఉండటంతో కాస్తంత జాగ్రత్తగా గమనిస్తే కానీ అది కనిపించదు. ఇలాంటి జీవిని అమెరికాలో బిగ్‌ఫుట్‌గా పిలుస్తారు. మనుషుల కంటే అమితమైన ఈ జీవులు చాలా పురాతనమైనవని, చాలా అరుదుగా మాత్రమే మనిషి కంటపడుతుంటాయని కథలుకథలుగా చెప్పుకుంటారు. వీటికి సంబంధించి పాదాల గుర్తుల ఫొటోలు కూడా నెట్టింట్లో ఉన్నాయి. అయితే, కొందరు మాత్రం బిగ్‌ఫుట్‌ను జానపద కథల్లో ఊహాజనిత జీవిగానే చూస్తారు. దాని ఉనికిని అంగీకరించరు.

Viral: సూపర్ ఐడియా బ్రో.. జొమాటోలో ఫుడ్ ఆర్డరిచ్చాక యువకుడు చేసిన పనికి జనాలు ఫిదా.. వీడియో వైరల్

అయితే, ఈ జీవిని చూడగా ఆ జంట అది బిగ్‌ఫుట్ అని నిర్ణయించారు. వెంటనే దాని కదలికలను కెమెరాలో రికార్డు చేశారు. మరోవైపు, మరో కెమెరాతో కొన్ని ఫొటోలు కూడా తీసుకున్నారు. వాటిని నెట్టింట పెట్టి తన అనుభవాన్ని పంచుకుంది. బిగ్‌ఫుట్ గురించి తనకూ అనేక సందేహాలు ఉండేవని, కానీ దాన్ని తొలిసారిగా కళ్లారా చూసిన తరువాత తన అనుమానాలన్నీ తొలగిపోయాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపై బిగ్‌ఫుట్ ఉందని అందరికీ చెబుతానని కూడా ఆమె పేర్కొంది. జనాలు కూడా ఆమెతో ఏకీభవించారు. తామూ గతంలో బిగ్‌ఫుట్‌ను చూశామని కొందరు చెప్పుకొచ్చారు.

Viral: వింత వ్యాధి..77 ఏళ్లు వచ్చినా బ్రహ్మచారిగా మిగిలిపోడానికి ఇతడు చెప్పిన కారణం తెలిస్తే..

Updated Date - 2023-10-14T19:45:47+05:30 IST