Viral Video: అగ్రరాజ్యంలో భరత నాట్యం.. అమెరికన్లను అవాక్కయ్యేలా చేసిన భారతీయ మహిళ..!

ABN , First Publish Date - 2023-08-21T18:58:51+05:30 IST

ఓ భారతీయ మహిళ అగ్రరాజ్యం అమెరికాలో పబ్లిక్ గా చేసిన భరతనాట్య ప్రదర్శన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

Viral Video: అగ్రరాజ్యంలో భరత నాట్యం.. అమెరికన్లను అవాక్కయ్యేలా చేసిన భారతీయ మహిళ..!

భారతదేశం గొప్పతనమంతా ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల్లో ఇమిడిపోయి ఉంది. విదేశీయులు భారతదేశాన్ని ఇష్టపడటానికి ఇదే పెద్ద కారణం. ఇక భారతదేశ వారసత్వ సంపదగా చెప్పుకునే కళారూపాలు దేశానికి మరింత కీర్తి తెస్తున్నాయి. 64కళలలో నృత్యం కూడా ఒకటి. భారతదేశంలో ప్రసిద్ది పొందిన నృత్యం భరతనాట్యం. ఓ భారతీయ మహిళ అగ్రరాజ్యం అమెరికాలో పబ్లిక్ గా చేసిన భరతనాట్య ప్రదర్శన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈమె వీడియో చూసిన భారతీయులు మహిళను అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో ప్రసిద్ది పొందిన ఎనిమిది శాస్త్రీయ నృత్యాలలో భరతనాట్యం ఒకటి(Indian classical dance Bharatanatyam). ఇది తమిళనాడు(Tamil Nadu)లో ఆవిర్బవించింది. విదేశీయులు కూడా భరతనాట్యానికి ఆకర్షితులవ్వడం ఈ కళలో ఉన్న గొప్పదనం. అమెరికా(America) దేశ రాజదాని వాషింగ్టన్(Washington) లో భారతీయ నృత్యకారిణి స్వాతి జై శంకర్(Indian classic dancer Swathi jai Shankar) అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడియోలో వాషింగ్టన్ లో ఉన్న 500అడుగుల స్మారక చిహ్నం ఎదుట స్వాతి జై శంకర్ భరతనాట్యం చేయడం చూడొచ్చు. ఇందులో ఆమె కుర్తా, లెగ్గింగ్స్ ధరించి , దుపట్టాను కప్పుకుని పద్దతిగా ఉన్నారు. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా వీడియో మొదలు నుండి చివరి వరకు నృత్యం ప్రదర్శించారు. ఆమె కదలికలు, ముద్రలు, మరీ ముఖ్యంగా నృత్యం చేస్తున్నంతసేపు ఆమెలో ఆత్మవిశ్వాసం, ముఖ కవళికలు వీక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఈమె నృత్యం చూసిన అమెరికన్లు అవాక్కవుతున్నారు. ఇక భారతీయులు ఈమె నృత్యాన్ని చూసి ఫిదా అయిపోయారు. విదేశాల్లో భారతీయ నృత్యాన్ని ప్రదర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Smartphone Cleaning: అందరూ తెలియక చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే.. వీటితో స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేస్తున్నారా..?



ఈ వీడియోను ప్రముఖ భారతీయ నృత్యాకారణి స్వాతి జై శంకర్ swathi.jaisankar తన ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ లో పోస్ట్ చేసారు. 'వాషింగ్టన్ పర్యటనలో భారతజాతి కోసం అప్పటికప్పుడు కొరియోగ్రఫీ చేశాను' అని ఆమె క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్వాతి ప్రదర్శనకు మంత్రముగ్దులవుతున్నారు. 'నేను భరతనాట్యం నేర్చుకుంటున్నాను' అని ఒకరు కామెంట్ చేశారు. 'విదేశీ గడ్డ మీద భారత నృత్యప్రదర్శన అద్బుతం' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఆమె నాట్యప్రదర్శన అమోఘం. భంగిమలు, ముద్రలు అధ్బతంగా ఉన్నాయి' అని మరికొందరు అంటున్నారు.

Smartphone Charging: స్మార్ట్‌ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చితే చాలు.. యమా స్పీడ్‌గా ఛార్జింగ్..!


Updated Date - 2023-08-21T18:58:51+05:30 IST