Viral Video: బైక్‌ను నాకంటే ఎవరూ బాగా నడపలేరన్న కాన్ఫిడెన్స్ ఉన్నా సరే.. ఇలా మాత్రం అస్సలు ట్రై చేయకండి..!

ABN , First Publish Date - 2023-02-21T19:25:40+05:30 IST

వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు నెటిజన్ల కళ్ళు విప్పారేలా చేస్తోంది. 'ఇదేం ఫీట్ బాబోయ్ మరీ ఇంత డేంజర్ గా సాహసాలు చేస్తారా?' అని

Viral Video: బైక్‌ను నాకంటే ఎవరూ బాగా నడపలేరన్న కాన్ఫిడెన్స్ ఉన్నా సరే.. ఇలా మాత్రం అస్సలు ట్రై చేయకండి..!

మగధీర సినిమాలో ధీర ధీర ధీర.. అనే మూడు పదాలు పదే పదే గుర్తుకొస్తాయి ఈ వీడియో చూస్తుంటే.. అంతుందా వీడియోలో అనుకుంటారేమో.. మన భారతీయులకు కాసింత ధైర్యమెక్కువే. అందుకే చాలా చోట్ల ఇప్పటికీ ఒళ్ళు గగుర్పాటుకు లోనయ్యే విధంగా సాహసాలు చేసేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు నెటిజన్ల కళ్ళు విప్పారేలా చేస్తోంది. 'ఇదేం ఫీట్ బాబోయ్ మరీ ఇంత డేంజర్ గా సాహసాలు చేస్తారా?' అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియోకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

అబ్బాయిలు చేసే సాహసాల్లో ముఖ్యంగా బైక్ రైడింగ్ లు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. వీటిలోనూ బోలెడు రకాలున్నాయి. వాటిలో మోటర్ డ్రోమ్ కూడా ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్. ఇందులో చెక్కతో వృత్తాకారంగా నిర్మించిన బావిలాంటి ప్రదేశం ఉంటుంది. ఇది సుమారు 5మీటర్ల పొడవు ఉంటుంది. సుమారు ఒక అంతస్తు అంత ఎత్తు ఉంటుంది. ఇందులో బైకర్ లు తమ బైక్ ను స్టార్ట్ చేసి క్రమంగా దాని అడుగు నుండి పైకి వస్తూ అంచుల మీద రైడ్ చేస్తారు. చూడటానికి వచ్చినవాళ్ళు లోపలికి తొంగిచూస్తూ స్టంట్ లను ఆస్వాదిస్తారు.

Read also: Shocking Video: అమ్మబాబోయ్.. ఏంటీ ఈ వింత ఆకారం.. చేపలు ఉండాల్సిన అక్వేరియంలో ఇదేంటి..!


లెజెండ్ రైడర్ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియోలో స్టంట్స్ చేసే వ్యక్తి కూడా అచ్చం ఈ మోటర్ డ్రోమ్ లో మొదలుపెట్టి క్రమంగా అంచుల మీదకు వచ్చేస్తాడు. అప్పటికే ఊపిరి బిగపట్టి చూస్తున్న నెటిజన్లకు మరింత షాక్ ఇస్తూ అతను బైక్ హ్యాండిల్స్ వదిలేసి క్రమంగా బ్యాక్ సీట్ లో అమ్మాయిలు కూర్చునే వన్ సైడ్ పొజిషన్ కు మారిపోయాడు. బైక్ ను అసలు బ్యాలెన్స్ చేయకుండా అతను అలా ఫ్రీగా కూర్చుని ఆ బావి గోడల మీద చక్కర్లు కొడుతూ ఉంటే నెటిజన్ల గుండెలు గుభేలుమంటూ ఉంటాయి. అతను మాత్రం రవ్వంత కూడా భయపడుతున్నట్టు కనిపించడు. దానికి బదులు ఆ స్టంట్ లో కిక్కును ఎంజాయ్ చేస్తున్నాడు.ఇతని బైక్ స్టంట్ చూసిన నెటిజన్లు ఒకటే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కొందరు మాత్రం సాహసం అంచున ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా మీరూ నేను తోప్ బైక్ రైడర్ ను అనే ఫీలింగ్ లో ఉంటే మాత్రం చక్కగా రోడ్డుమీద జాగ్రత్తగా వెళ్ళండి. ఇలాంటి సాహసాల జోలికి వెళ్లి ఎముకలు సున్నం జేసుకునే పని చెయ్యకండి.

Updated Date - 2023-02-21T20:06:33+05:30 IST