Share News

Viral Video: ఈ తేనెటీగల టీమ్ వర్క్ అదుర్స్.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా..!

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:26 PM

ఎప్పుడూ ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి మాంచి మోటివేషన్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

Viral Video: ఈ  తేనెటీగల టీమ్ వర్క్ అదుర్స్.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా..!

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాకు పరిచయం అక్కర్లేని పేరు. మహీంద్రా సంస్థల అధినేత అయిన ఈయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ఎన్నో ఆసక్తికర విషయాలనే కాకుండా, స్పూర్తివంతమైన సంఘటనలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో తేనెటీగలు చేసిన టీమ్ వర్క్ కు ఆనంద్ మహీంద్రాతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూనే ఉంటారు. ఈయన షేర్ చేసే విషయాలు కొత్తగానూ, ఇన్ఫర్ప్మేషన్ అందించేవిగానూ ఉంటాయి. తాజాగా ఆయనొక వీడియో షేర్ చేశారు. వీడియోలో ఒక చిన్న ఫాంటా బాటిల్ కనిపిస్తుంది. ఆ బాటిల్ మూతను కాస్త వదులుగానే ఉంచారు. ఫాంటా బాటిల్ మూతకు రెండు తేనెటీగలు చుట్టుకుని ఉన్నాయి. అవి ఫాంటా తీపిని గ్రహించి ఆ బాటిల్ మూతను తెరవడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తాయి. రెండు తేనెటీగలు శక్తిని ఉపయోగించి బాటిల్ మూతను తిప్పడం, ఆ తరువాత దాన్ని పైకెత్తి కింద పడేయడం చేస్తాయి.

ఇది కూడా చదవండి: Health Tips: శరీరంలో రక్తం కలుషితమైతే జరిగేదేంటి? దీన్ని పరిష్కరించడానికి ఏం చెయ్యాలంటే..



ఈ ఆసక్తిక వీడియోను anand mahindra తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ లో షేర్ చేశారు. 'నేను ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నాను. టీమ్ వర్క్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది' అనే క్యాప్షన్ తో తన అనుచరులను మోటివేట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాకవుతున్నారు. పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'మీరు చెప్పింది నిజమే సర్.. టీమ్ వర్క్ తో కష్టమైన పనులు సాధ్యమవుతాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'చిన్న జీవులు అయినా గొప్ప ప్రేరణ కలిగిస్తున్నాయి. మనుషులు వీటి నుండి నేర్చుకోవాలి' అని ఇంకొకరు స్పందించారు. 'తేనెటీగలు పువ్వులలో మకరందాన్ని వద్దని ఫాంటా కోసం ప్రయత్నిస్తున్నాయి' అని మరొకరు కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి: రోజూ 2కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే.. జరిగేది ఇదే..!

Updated Date - Dec 18 , 2023 | 03:26 PM