Viral Video: ఈ బార్బర్ చేసిన పనికి విస్తుపోయిన లేడీ కస్టమర్.. ఏం చేసాడంటే..
ABN , First Publish Date - 2023-01-16T16:13:16+05:30 IST
ఆ మహిళ ఏడుస్తున్నా అతను తను చేస్తున్న పని మాత్రం మానలేదు..
తనదగ్గరకు వచ్చిన కస్టమర్ విషయంలో ఓ బార్బర్ ప్రవర్తన ఆ లేడీ కస్టమర్ ను విస్తుపోయేలా చేసింది. కేవలం ఆమె మాత్రమే కాదు, అతను చేసిన పని చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని వివరాల్లోకి వెళితే..
ఓ మహిళా కస్టమర్ బార్బర్ దగ్గరకు వెళ్ళింది. ఆమె తనకెంతో ఇష్టమైన జట్టును పూర్తిగా తొలగించి గుండు చేయమని బార్బర్ ను అడిగింది. దానికి గల కారణం తెలుసుకున్న ఆ బార్బర్ మనసు ఒక్కసారిగా బరువెక్కింది. కానీ తన వృత్తి తాను చేయక తప్పదని అతను ఆ మహిళా కస్టమర్ జుట్టు మొత్తం తీసి గుండు చేసాడు. క్యాన్సర్ కారణంగా ఆ మహిళ కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవలసి ఉంది. ఆ ట్రీట్మెంట్ వల్ల జుట్టు దానికదే రాలిపోతుంటే పేషెంట్ లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదని ముందుగానే జట్టు తీయించుకోవడం ప్రతి క్యాన్సర్ పేషెంట్ కు చేసే సూచన. కానీ ఆ మహిళ తన జుట్టు తొలగిస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉంది. బార్బర్ ఆమెను ఓదార్చాడు. అంతటితో ఆగకుండా ఆ బార్బర్ తనకు తానుగా ట్రిమ్మర్ తో తన జుట్టును కూడా తొలగించి గుండు చేసుకున్నాడు.
అతనలా చేస్తుండటం గమనించి ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ కు గురయింది. అతను చేస్తున్న పనిని అడ్డుకోవాలని చూసింది. కానీ ఆ బార్బర్ తన జట్టును కూడా నీట్ గా షేవ్ చేసుకున్నాడు. 'సమస్యతో ఒక్కరే పోరాడలేరు అందరూ కలసికట్టుగా పోరాడాలి' అనే అర్థవంతమయిన సందేశాన్ని అందరికీ ఇస్తూ ఇతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.