Share News

Viral: ఓ ఇంటి యజమానికి దిమ్మతిరిగిపోయే షాక్.. 18ఏళ్ళ తరువాత సడన్ గా ఇంటికి చేరిన గ్యాస్ బిల్లు.. అందులో ఎంతుందంటే..

ABN , First Publish Date - 2023-10-30T16:30:54+05:30 IST

కొత్త ఇంటికి చేరిన తరువాత వారికి ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు. కానీ ఉన్నట్టుండి వారి ఇంటికి ఓ రశీదు చేరింది. దాన్ని చూసిన ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది.

Viral: ఓ ఇంటి యజమానికి దిమ్మతిరిగిపోయే షాక్..  18ఏళ్ళ తరువాత  సడన్ గా ఇంటికి చేరిన గ్యాస్ బిల్లు.. అందులో ఎంతుందంటే..

గ్యాస్ వినియోగం ఇప్పట్లో ప్రతి ఇంట్లోనూ ఉంది. కొందరు ఎలక్ట్రిక్ కుక్కర్లు, స్టవ్ లు వినియోగించినా అధికశాతం మంది మాత్రం గ్యాస్ కే మొగ్గు చూపుతారు. ఓ కుటుంబం 18ఏళ్ల కిందట కొత్త ఇంట్లోకి చేరింది. అప్పటినుండి వారికి ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు. కానీ ఉన్నట్టుండి వారి ఇంటికి ఓ రశీదు చేరింది. దాన్ని చూసిన ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది. గ్యాస్ బిల్లు కట్టండి అంటూ ఆ రశీదులో మెన్షన్ చేసిన మొత్తం చూసి ఆ కుటుంబం మొత్తం షాక్ కు గురయ్యారు. ఇది చాలా మోసం అని గగ్గోలు పెడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

గ్యాస్ వినియోగం భారతదేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా అధికంగా ఉంటుంది. విదేశాలలో గ్యాస్ సరఫరా భారతదేశంలో నీటిని పైపులలో సరఫరా చేసనట్టే చేస్తారు. యునైటెడ్ కింగ్డమ్(UK) లో గ్యాస్ వినియోగానికి సంబంధించి ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. యుకె లో నివాసం ఉంటున్న 44ఏళ్ళ లీ హేన్స్, తన భర్త ఉడ్లీతో కలసి 18ఏళ్ల కిందట కొత్త ఇంట్లో చేరారు. 2005లో ఆ ఇంటికి చేరిన తరువాత విద్యుత్ బిల్లు నుండి ప్రతిదీ వారు నెలనెలా కట్టారు. కానీ వారికి గ్యాస్ ఎవరు సప్లై చేస్తున్నారో, దాని బిల్లు ఎవరికి కట్టాలో అర్థం కాలేదు. వారికి గ్యాస్ సరఫరా చేస్తున్న ఏజెన్సీ ఎక్కడుందో వారు కనుక్కోలేకపోయారు. అప్పట్లో వారు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు కూడా వారి దగ్గరున్నాయి. కానీ మూడునెలల క్రితం వారి ఇంటికి గ్యాస్ సరఫరా చేసే ఏజెన్సీ వారి నుండి నోటీస్ చేరింది.

Viral Video: మార్కెట్ లోకి కొత్తరకం జీన్స్.. నెటిజన్ల శాపాలు మామూలుగా లేవుగా..



3నెలల తరువాత 18ఏళ్ళ నుండి ఆ ఇంట్లో ఉంటూ గ్యాస్ వినియోగించుకున్నందుకు గానూ ఏకంగా 11లక్షల(11Lakhs gas bill) విలువైన బిల్లు చెల్లించాలంటూ రశీదు పంపారు. అది చూసిన ఆ భార్యాభర్తలు షాకయ్యారు. ఇంటికి చేరిన కొత్తలో తాము గ్యాస్ బిల్లు కట్టడానికి చేసిన ప్రయత్నాలు, వాటికి సంబంధించిన రశీదులు కూడా చూపిస్తున్నారు. ప్రస్తుతం 11లక్షల చెల్లింపులకు సంబంధించి కేసులో భార్యాభర్తలిద్దరూ పోరాడుతున్నారు.

Viral Video: ఇల్లు శుభ్రం చేస్తోంటే పైకప్పు నుండి వింత శబ్దాలు. అనుమానంగానే చేతులు పెట్టిన యువతికి దొరికిందేంటో చూస్తే..


Updated Date - 2023-10-30T16:30:54+05:30 IST