Viral News: 3 రోజుల్లో 3 మోటార్లతో 21 లక్షల లీటర్ల నీరు తోడేసిన అధికారి..ఎందుకో తెలుసా ?

ABN , First Publish Date - 2023-05-26T16:02:25+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. రిజర్వాయర్‌(లో పడిపోయిన సెల్‌కోసం ఓ అధికారి ఏకంగా రిజర్వాయర్ నుంచి మొత్తం నీటిని ఖాళీ చేయించాడు.

Viral News: 3 రోజుల్లో 3 మోటార్లతో 21 లక్షల లీటర్ల నీరు తోడేసిన అధికారి..ఎందుకో తెలుసా ?

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో ఓ విచిత్రమైన సంఘటన(Bizarre Incident) చోటుచేసుకుంది. రిజర్వాయర్‌(Reservoir)లో పడిపోయిన సెల్‌కోసం ఓ అధికారి ఏకంగా రిజర్వాయర్ నుంచి మొత్తం నీటిని ఖాళీ చేయించాడు. దీనిపై వివరణ అడగగా ‘‘రిజర్వాయర్ నీరు నిరుపయోగం’’ అని చెప్పడం అధికారులను ఆశ్చర్యపర్చింది. పదవిని దుర్వినియోగం చేయడంతోపాటు, సంబంధిత అధికారి అనుమతి తీసుకోలేదని కలెక్టర్ సస్పెండ్ చేశాడు.

ఛత్తీస్‌గడ్‌(Chhattisgarh)లోని కాంకేర్ జిల్లా(Kanker district) కోయిలిబెడ బ్లాక్‌(Koilibeda block)లోని ఫుడ్ ఆఫీసర్‌(Food Officer)గా పనిచేస్తున్న రాజేష్ విశ్వాస్(Rajesh Vishwas) ఖేర్‌కట్టా డ్యామ్‌(Kherkatta Dam)లో సెలవులను ఎంజాయ్ చేసేందుకు వెళ్లాడు. అనుకోకుండా అతని లక్ష రూపాయల విలువైన ఫోన్ రిజర్వాయర్‌లో పడిపోయింది. ఆ తర్వాత స్థానికులు ఫోన్ ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయినా సెల్‌ఫోన్ దొరక్కపోవడంతో రెండు 30 హెచ్‌పి డీజిల్ పంపులను తెప్పించి మూడు రోజుల పాటు నిరంతరం నడుపుతూ నీటిని బయటకు తోడించాడు. తన ఫోన్‌ను బయటకు తీయడానికి దాదాపు 1,500 ఎకరాల వ్యవసాయ భూమికి సరిపోయే 21 లక్షల లీటర్ల నీటిని ఖాళీ చేశాడు.

సోమవారం సాయంత్రం నుంచి పంపుల ద్వారా నీటిని తోడటం ప్రారంభించి గురువారం వరకు తోడుతూనే ఉన్నారు. దీంతో స్థానికులు నీటిపారుదల, జలవనరుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేవారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పనులు నిలిపివేశారు. అయితే ఆరు అడుగుల లోతు వరకు అంటే దాదాపు 21 లక్షల లీటర్ల నీటిని ఇప్పటికే పంపింగ్ చేశారు. ఈ ప్రాంతంలో వేసవిలో కూడా 10 అడుగుల లోతు నీరు ఉంటుంది. జంతువులు తరచుగా దాని నుండి తాగేందుకు ఉపయోగిస్తారు.

‘‘ఆదివారం సెలవు దినం కావడంతో స్నేహితులతో కలిసి డ్యామ్‌లో స్నానానికి వెళ్లాను. నా ఫోన్ నీటిలో పడిపోయింది. ఆ రిజర్వాయర్‌లో నీరు ఉపయోగంలేదు. అది 10 అడుగుల లోతు ఉంది. నా సెల్ ఫోన్ కోసం స్థానికులు నీటిలోకి దిగి వెతికారు. అయినా దొరకలేదు. సెల్‌ఫోన్‌లో డిపార్ట్‌మెంట్‌కు చెందిన కీలకమైన డేటా ఉంది. నేను SDOకి ఫోన్ చేయగా అనుమతిచ్చారు. అతను నిరాకరించారు’’ అని అధికారి విశ్వాస్ సమాధానమిచ్చారు.

వాస్తవానికి వేసవిలో సమీప ప్రాంతాల్లో వ్యవసాయానికి, జంతువుల తాగునీటికి ఆ రిజర్వాయర్ 10 అడుగుల వరకు నీటిని నిల్వ చేస్తారు. నీటిని వృధా చేయడంతో స్థానిక రైతులు ఆందోళన చెందారు. దీనిపై ఉత్తరాఖండ్ బీజేపీ నేత భూపేష్ భఘేట్ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే ఛత్తీస్‌గఢ్ మంత్రులను జర్నలిస్టులు ప్రశ్నించగా విషయం మాకు తెలియదు. తెలుసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2023-05-26T16:02:25+05:30 IST