Share News

Viral: ఆన్లైన్ లో జాబ్స్ కోసం వెతుకుతుంటారా? ఓ కుర్రాడికి ఏం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-10-25T11:24:01+05:30 IST

ఆన్లైన్ లో జాబ్ కోసం ప్రయత్నం చేసిన కుర్రాడు జీవితంలో కోలుకోలేని దెబ్బ తిన్నాడు.

 Viral: ఆన్లైన్ లో జాబ్స్ కోసం వెతుకుతుంటారా? ఓ కుర్రాడికి ఏం జరిగిందో తెలిస్తే..

చదువు పూర్తైన తరువాత ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం రోడ్లమీద కాళ్ళరిగేలా తిరిగేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. చాలావరకు కంపెనీలు జాబ్ హైరింగ్ గురించి ఆన్లోనే సమాచారం ఇస్తుండంటంతో చాలామంది అభ్యర్థులు ఆన్లైన్ లోనే అప్లై చేస్తుంటారు. కంపెనీ నుండి పిలుపు వస్తే అప్పుడు కంపెనీలకు ఇంటర్ప్యూకు వెళుతుంటారు. ఓ కుర్రాడు ఆన్లైన్ లో జాబ్స్ కోసం వెతుకుతూ దారుణంగా నష్టపోయాడు. ఇతనికి ఎదురైన అనుభవం తెలిసిన తరువాత ఆన్లైన్ లో జాబ్ ప్రయత్నాలు చేయలంటేనే భయపడిపోతారు. ఈ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుంటే..

చంఢీగడ్(Chandigarh) లో ఆన్లైన్ జాబ్స్(online jobs) కు ప్రయత్నం చేస్తూ ఓ కుర్రాడు చాలా నష్టపోయాడు. నవీన్ గుప్తా అనే వ్యక్తి జాబ్స్ ప్రయత్నాలలో భాగంగా ఆన్లైన్ లో వివిధ జాబ్ సెర్ఛ్ పోర్టల్ లలో తన బయోడేటా అప్లోడ్ చేశాడు. అతనికి ఓ నేషనల్ మీడియా గ్రూప్ లో ఉద్యోగం ఉందంటూ ఓ కాల్ వచ్చింది. ఆ కాల్ లో వ్యక్తి ఇంటర్ప్యూ కోసం రూ.6,500 చెల్లించాలని చెప్పారు. ఆ కాల్ నిజమేనని, నిజంగానే తనకు మంచి కంపెనీలో జాబ్ వస్తుందని నవీన్ నమ్మాడు. దాంతో రూ. 6,500 ఆన్లైన్ లోనే పంపాడు. ఆ తర్వాత జాబ్ కు సంబంధించిన కోర్సుల కోసం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం, మెడికల్ టెస్టులు, ఐటీ ట్రైనింగ్ ఇలా చాలా వాటికి దాదాపు రూ. 6.4లక్షల చెల్లించాడు. ఇవన్నీ అయ్యాక జాబ్ ఆఫర్ చేసిన వ్యక్తి అపాయిట్మెంట్ లెటర్ ను మెయిల్ లో పంపాడు. అయితే ఆ మెయిల్ లో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ ఫేక్ దని తేలడంతో అతను లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమేదు చేశాడు.

Viral Video: రోడ్డు పక్కన టీ అమ్ముతున్న రజనీకాంత్.. ఇదేమైనా కొత్త సినిమా షూటింగేమో అనుకున్నారంతా.. కానీ అసలు సంగతి తెలిసి..



ఈ మధ్యకాలంలో స్కామర్లు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని CENT నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ లో ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది.

జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారు గుర్తింపు ఉన్న బాజ్ పోర్టల్ లను మాత్రమే సందర్శించాలి. వేరే మార్గాలలో ఉద్యోగాల కోసం అప్లై చేసేటప్పుడు జాబ్ ఆఫర్ చేస్తున్న సంస్థ, ఆఫర్ చేస్తున్న వ్యక్తి గురించి క్షుణ్ణంగా విచారించాలి. వారి పేరు, కంపెనీ, జాబ్ వివరాలు, దాని మెయిన్ బ్రాంచ్, దాని పూర్వపరాలు అన్నీ అడిగి తెలుసుకోవాలి. ఇప్పట్లో ప్రతి సమాచారం గూగుల్ లో ఉంటుంది కాబట్టి గూగుల్ లో సదరు కంపెనీ గురించి సెర్చ్ చేసి తెలుసుకోవాలి.

ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ వంటి వివరాలు పొందుపరిచేముందు లేదా ఇతరులకు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ లో తెలియని వారి బ్యాంక్ ఖాతాలకు డబ్బు బదిలీ చేయకూడదు, బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదు. జాబ్ మీద కంగారుతో ఎక్కడంటే అక్కడ వివరాలు పొందుపరచకూడదు.

Viral Video: వావ్ ఏం టెక్నిక్ బాస్.. చేతులు నొప్పులు రాకుండా గోధుమలను ఎలా శుభ్రం చేస్తున్నారో చూస్తే..


Updated Date - 2023-10-25T11:24:01+05:30 IST