Share News

Fight in Metro Train: అమ్మ బాబోయ్.. ఈ అమ్మాయి ఆవేశం మామూలుగా లేదుగా.. మెట్రో రైల్లో అందరూ చూస్తుండగానే..!

ABN , First Publish Date - 2023-10-30T18:20:15+05:30 IST

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతీయువకుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. యువతి ఆ యువకుడి చెంపఛెళ్లుమనిపించడం చూసి జనాలు షాకైపోతున్నారు.

Fight in Metro Train: అమ్మ బాబోయ్.. ఈ అమ్మాయి ఆవేశం మామూలుగా లేదుగా.. మెట్రో రైల్లో అందరూ చూస్తుండగానే..!

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ మెట్రో రైల్లోని వీడియోలు వైరల్‌(Viral Video) కాని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో! మెట్రో ప్రయాణికులు గొడవ పడే వీడియోలు నిత్యం నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంటాయి. కొన్నింటిని చూసి జనాలు భయపడిపోతే మరికొన్నింటిని చూసి ఆశ్చర్యపోతుంటారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలోని యువతి మెట్రోలో ప్రయాణిస్తున్న మరో యువకుడిపై శివంగిలా రెచ్చిపోయిన తీరు జనాలను ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలను మూడు భాగాలుగా చిత్రీకరించి ఓ వ్యక్తి నెట్టింట పంచుకోవడంతో ఇది ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

NRI News: ఫ్యామిలీతో సహా విదేశాల్లో సెటిల్ అవాలనుకుంటే.. తప్పక గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలివీ..!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, సీటులో కూర్చుకున్న ఓ యువకుడు, అతడి ఎదురుగా నిలబడ్డ మరో యువతి మధ్య అకస్మాత్తుగా గొడవ మొదలైంది. గొడవకు కారణం తెలీదు కానీ ఆ యువతి ఉన్నట్టుండి అతడి చెంప ఛెళ్లుమనిపించింది(Girl slaps boy in Delhi metro). ఇక ఆ తరువాత నుంచి వారి వివాదం పతాకస్థాయికి వెళ్లిపోయింది. ఆ ఇద్దరు ఒకరినొకరు తెగ తిట్టుకున్నారు. ఓ దశలో యువకుడు కూడా ఆ యువతిపై చేయి చేసుకునే వరకూ వెళ్లాడుకానీ అక్కడున్న వారు అతడిని నిలువరించారు. యువతి మాత్రం తగ్గేదేలేదంటూ అతడిపై రెచ్చిపోయింది. ఇద్దరు ఒకరిపై మరొకరు టాపులేచిపోయేలా అరుచుకోవడంతో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. తన స్టేషన్ వచ్చాక ఆమె రైలు దిగిపోవడంతో వారి వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది.


ఇక వీడియోను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తు్న్నారు. ఈ మధ్య మెట్రోల్లో ఫ్రీ వినోదం దొరుకుతోందంటూ సరదా కామెంట్స్ చేశారు. ఈ ఎంటర్‌టైన్మెంట్ కోసమే తాను రోజువారి టిక్కెట్లకు బదులు నెలవారీ పాస్ తీసుకున్నట్టు ఓ వ్యక్తి సరదా కామెంట్ చేశారు. అయితే, మరికొందరు మాత్రం ప్రజల్లో సహనం తగ్గిపోతోందంటూ విచారం వ్యక్తం చేశారు. యువతి ఆ రేంజ్‌లో యువకుడిపై రెచ్చిపోవడం చూసి షాకైపోయారు. మెట్రోల్లో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయంటూ అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-30T19:48:34+05:30 IST