Venky Atluri: మౌత్‌టాక్‌ మనీగా మారింది

ABN , First Publish Date - 2023-02-26T20:42:15+05:30 IST

వైవిధ్య నటుడు ధనుష్ (Dhanush) హీరోగా నటించిన సినిమా ‘వాత్తి’ (Vaathi). సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించారు. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

Venky Atluri: మౌత్‌టాక్‌ మనీగా మారింది

కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా నటించిన సినిమా ‘వాత్తి’ (Vaathi). సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించారు. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం చెన్నైలో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ‘వాత్తి’ బ్లాక్ బాస్టర్ విజయానికి మీడియానే కారణమని వెంకీ అట్లూరి చెప్పారు.

‘‘వాత్తి మూవీ విడుదలకు ముందే మీడియాకు ప్రత్యేకంగా షోను వేశాం. ఈ సినిమాను చూసిన వారు మంచి రేటింగ్‌ ఇస్తూ, పాజిటివ్‌ రివ్యూలు రాశారు. ఇదే పాజిటివ్‌ టాక్‌ సినిమాను చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడిలోనూ కనిపించింది. ఆ మౌత్‌టాక్‌ మనీగా మారింది. ఫలితంగా ఎనిమిది రోజుల్లో ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకుమించి ఇంకేం కావాలి. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచిన హీరో ధనుష్‌, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని వెంకీ అట్లూరి పేర్కొన్నారు. అనంతరం చిత్రబృందం కేక్ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత లలిత్‌ కుమార్‌ సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియోస్‌‌పై తమిళంలో రిలీజ్‌ చేశారు. ఈ సినిమా ‘సార్’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-02-26T20:43:42+05:30 IST