Uber driver: రైడ్స్ క్యాన్సిల్ చేసి రూ.23 లక్షలు సంపాదించిన ఉబెర్ డ్రైవర్! ఈ పెద్దాయన ప్లాన్ ఏంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-11-06T21:37:35+05:30 IST
డబ్భై ఏళ్ల వయసులో ఈ ఊబెర్ డ్రైవర్ ఏడాది సంపాదన రూ.23 లక్షలు. ఇదేలా సాధ్యమైందో తెలిస్తే మతిపోవాల్సిందే.
ఇంటర్నెట్ డెస్క్: రోజంతా డ్రైవ్ చేసినా ఖర్చులకు సరిపడా డబ్బులు రావట్లేదని ఊబెర్(Uber), ఓలా(Ola) డ్రైవర్‌లు నిత్యం ఫిర్యాదు చేయడం చూస్తూనే ఉంటాం. కానీ ఓ ఉబెర్ డ్రైవర్ మాత్రం తనకు వచ్చిన రైడ్స్ రిక్వెస్టుల్లో అధికశాతం క్యాన్సిల్ చేసి కూడా రూ.23 లక్షలు సంపాదించాడు! అది కూడా ఒక్క ఏడాదిలో! దీంతో, ఈ ఉబెర్ డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral) మారింది.
అమెరికా(USA) నార్త్ కెరోలీనా రాష్ట్రానికి(North Carolina) చెందిన ఓ వ్యక్తి రిటైర్ అయ్యాక కొద్దోగొప్పో సంపాదించుకునేందుకు ఉబెర్ డ్రైవర్‌గా మారాడు. అయితే, వచ్చి రైడ్ రిక్వెస్టుల్లో దాదాపు 90 శాతం క్యాన్సిల్ చేసే అతడు గతేడాది సుమారు రూ.23 లక్షలు(28 వేల డాలర్లు) సంపాదించాడు. అతడి టెక్నిక్ ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.
NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట
Viral Video: బాబోయ్..భీముడు మళ్లీ పుట్టాడా? పుట్టిన వెంటనే ఈ నవజాత శిశువు చేసిన పనికి నర్సు షాక్!
‘‘చాలా వరకూ నేను కస్టమర్ల రిక్వస్టులు తిరస్కరిస్తా. డిమాండ్ అధికంగా ఉన్న సమయాల్లోనే డ్రైవ్ చేస్తా. దీంతో, ప్రస్తుతం వారానికి 30 గంటలకు మించి ఉబెర్ నడపడం కుదరట్లేదు. ఈ మధ్య కాలంలో మా ప్రాంతంలో సర్జ్ టైం (డిమాండ్ అధికంగా ఉండే వేళలు) తగ్గిపోవడంతో నా పని కూడా తగ్గిపోయింది. సాధారణంగా నేను రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 2.30 వరకూ ఉంటా. ఆ సమయాల్లో నాకు నచ్చిన రైడ్స్ వస్తేనే ఎక్కించుకుంటాను. రానూపోనూ క్యాబ్ బుక్ చేసుకునే వారి రైడ్ రిక్వెస్టుల్నే స్వీకరిస్తా’’ అంటూ అతడు తన వ్యూహాన్ని చెప్పుకొచ్చాడు(USA uber driver makes 28k dollars a year while cancelling rides).
సాధారణంగా ఊబెర్ ఇలా చేసే డ్రైవర్లను పక్కన పెట్టే్స్తుంది. వారికి తక్కువ సంఖ్యలో రైడ్లను కేటాయిస్తుంది. కానీ, తన వ్యూహంపై నమ్మకమున్న ఆ పెద్దాయన రిస్క్ తీసుకుమని మరీ పెద్ద మొత్తం సంపాదించాడు.
Viral: ఈ సింహానికి ఏమైంది? నడిరోడ్డు మీద ఊహించని విధంగా.. వీడియో చూసి షాకైపోతున్న జనాలు!