TJMM: భారీ స్థాయిలో పాట చిత్రీకరణ..!

ABN , First Publish Date - 2023-02-22T18:25:18+05:30 IST

రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkaar). లవ్ రంజన్ (Luv Ranjan) దర్శకత్వం వహిస్తున్నారు.

TJMM: భారీ స్థాయిలో పాట చిత్రీకరణ..!

రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkaar). లవ్ రంజన్ (Luv Ranjan) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ హోలీ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా ఓ పాటను విడుదల చేశారు.

TJMM1.jpg

‘తూ ఝూఠీ మై మక్కర్’ నుంచి ‘షో మీ దా తుమ్క’ (Show Me The Thumka) అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. డ్యాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya) ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటలో శ్రద్ధా, ఆలియా తమ డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. హుక్ స్టెప్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఈ పాటను భారీ స్థాయిలో దాదాపుగా 1200 మంది డ్యాన్సర్స్‌తో చిత్రీకరించారు. అంత మంది డ్యాన్సర్స్‌తో పాటను చిత్రీకరించడం అంటే మాములు విషయం కాదు. ఈ సాంగ్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాను విపరీతంగా ఊపేస్తుంది. నెటిజన్స్ కూడా విపరీతంగా షేర్ చేస్తున్నారు. ‘తూ ఝూఠీ మై మక్కర్’ ను టీ సిరీస్, లవ్ ఫిలిమ్స్, అంకుర్ గార్గ్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

Updated Date - 2023-02-22T19:08:29+05:30 IST