Trisha Krishnan: విజయ్‌తో 14ఏళ్ల తర్వాత రొమాన్స్

ABN , First Publish Date - 2023-02-01T15:45:01+05:30 IST

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసే నటుడు విజయ్ (Vijay). ఆయన తాజాగా లోకేశ్ కనక‌రాజ్ (Lokesh Kanagaraj) తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.

Trisha Krishnan: విజయ్‌తో 14ఏళ్ల తర్వాత రొమాన్స్

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసే నటుడు విజయ్ (Vijay). ఆయన తాజాగా లోకేశ్ కనక‌రాజ్ (Lokesh Kanagaraj) తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 67’ (Thalapathy 67) అని వ్యవహరిస్తున్నారు. ‘విక్రమ్’ (Vikram) వంటి హిట్ తర్వాత లోకేశ్ నుంచి వస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ మూవీపై భారీ బజ్ ఉంది. మేకర్స్ ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఐకానిక్ ప్రాజెక్టులో భాగమైనందుకు సంతోషంగా ఉందని త్రిష తెలిపారు. ‘‘నాకు ఇష్టమైన వ్యక్తులు, ప్రతిభ కలిగిన టీమ్‌తో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని త్రిష చెప్పారు. విజయ్, త్రిష కలసి గతంలో నాలుగు సినిమాల్లో నటించారు. తాజాగా ఐదోసారి కలసి పనిచేయబోతున్నారు. దాదాపుగా 14ఏళ్ల అనంతరం ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతుండటం చెప్పుకోదగ్గ విశేషం. ‘దళపతి 67’ పై భారీ అంచనాలున్నాయి. అంచనాలను మించి రాణించాలని మేకర్స్ అనుకుంటున్నారు. కీలక పాత్రల కోసం అన్ని ఇండస్ట్రీల నుంచి నటీనటులను తీసుకుంటున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామాస్, సాండీ మాస్టర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహాంస సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - 2023-02-01T15:45:03+05:30 IST