Leo: విజయ్ సినిమా నుంచి తప్పుకున్న త్రిష?.. క్లారిటీ ఇచ్చిన నటి తల్లి

ABN , First Publish Date - 2023-02-08T14:39:12+05:30 IST

కోలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘లియో’ (Leo). ‘లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్’‌లో భాగంగా

Leo: విజయ్ సినిమా నుంచి తప్పుకున్న త్రిష?.. క్లారిటీ ఇచ్చిన నటి తల్లి
Trisha

కోలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘లియో’ (Leo). ‘లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్’‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ (Lokesh Kangaraj) దర్శకత్వం వహిస్తుండగా.. తమిళ నటుడు విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో ఈయనతో పాటు ఎంతోమంది ప్రముఖులు కీలకపాత్రలు చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ జోడీగా త్రిష (Trisha) నటించనుందని కొన్ని రోజుల క్రితం ఈ చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది.

thalapathy.jpg

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి త్రిష తప్పుకుందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. మూవీ టీం కొన్ని విభేధాలు రావడం వల్ల ఈ బ్యూటీ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా త్రిష తల్లి ఉమా కృష్ణన్ క్లారిటీ ఇచ్చింది. ఉమా కృష్ణన్ (Uma Krishnan) మాట్లాడుతూ.. ‘లియో ప్రస్తుతం షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. త్రిష కూడా అక్కడే ఉంది. తన క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆ నెట్‌లో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు’ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. త్రిష సైతం కశ్మీర్‌‌లో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ వీడియోని షేర్ చేసింది. దీంతో ‘లియో’ సినిమా విషయంలో వచ్చినవన్నీ పుకార్లు మాత్రమేనని అర్థమవుతోంది.

Updated Date - 2023-02-08T14:39:14+05:30 IST