Viral: మహిళా కార్పొరేట్ ఉద్యోగి వింత రాజీనామా! ఇలాంటి లేఖ భూప్రపంచంలో మరొకటి ఉండదు!
ABN , Publish Date - Dec 22 , 2023 | 04:51 PM
ఓ కార్పొరేట్ కంపెనీలోని మహిళా అధికారి.. పిల్లల పుస్తకాల్లోని పేపర్‌పై రాజీనామా లేఖ రాసి పంపించిన ఘటన వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ కంపెనీల్లో సీఈఓలు, సీఎఫ్‌ఓల స్థాయి ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతలు, సవాళ్లు, జీతాలు సామాన్యుల ఊహకు కూడా అందవు. అంతటి కీలక బాధ్యత నిర్వహించిన ఓ మహిళా ఉన్నతాధికారి రాసిన రాజీనామా లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
సాధారణంగా రాజీనామా అంటే కాస్త కార్పొరేట్ స్టైల్లో హుందాగా ఉంటుంది. ఇక ఉన్నతాధికారులు ఎవరైనా తమకు ఇచ్చిన లెటర్ హెడ్లపై రాజీనామాను టైప్ చేసి పంపిస్తారు. కానీ, రింకూ పటేల్ అనే మహిళ మాత్రం ఇందుకు భిన్నమైన పంథా ఎంచుకున్నారు. రింకూ పటేల్ మిట్షీ ఇండియా సంస్థలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఇటీవలే రాజీనామా చేశారు. అయితే, ఆమె తన రాజీనామా లేఖ విషయంలో డిఫరెంట్ స్టైల్ ఎంచుకుంది.
కార్పొరేట్ శైలికి భిన్నంగా ఆమె పిల్లల పుస్తకంలోంచి చింపి తీసుకున్నట్టు ఉన్న ఓ రూల్డ్ పేపర్‌పై తన స్వదస్తూరితో లేఖ రాశారు. ‘‘వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తున్నా, ఇంతకాలం సంస్థలో పనిచేయడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది’’ అంటూ ఆమె లేఖలో రాసి కంపెనీకి పంపించారు. (Top female executive handwritten resignation letter on ruled paper).
ఈ ఘటనకు సంబంధించి కంపెనీ.. స్టాక్ మార్కెట్‌కు సమాచారం ఇచ్చింది. కొత్త సీఎఫ్‌ఓ కోసం వెతుకుతున్నామని కూడా లిఖితపూర్వకంగా తెలియజేసింది. సీఎఫ్ఓను నియమించుకున్నాక మళ్లీ స్టాక్ మార్కెట్లకు సమాచారం అందిస్తామని మిస్టీ కంపెనీ తెలిపింది. సంస్థ పంపించిన రాజీనామా లేఖను బాంబే స్టాక్ ఎక్సేంజ్ తన వెబ్‌సైట్‌లో పెట్టడంతో ఈ లేఖ నెట్టింట వైరల్‌గా మారింది. ఈమెయిల్స్ రాజ్యమేలుతున్న కాలంలో ఇలా చిన్న పిల్లల పుస్తకంలోని పేపర్‌పై, అదీ చేతిరాతతో రాజీనామా ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.