Share News

Viral: తన భర్త కోసం వంట ఏం చేసావని వంటమనిషిని ఫోన్లో అడిగిన భార్య.. అతడి సమాధానం విని డౌట్..ఇంటికొచ్చి చూస్తే.. !

ABN , Publish Date - Dec 24 , 2023 | 07:06 PM

వంట ఏం చేశావని వంటమనిషిని అడగిన ఓ భార్యకు తన భర్త జీవితంలో మరో కోణం తెలిసొచ్చి షాకైపోయింది.

Viral: తన భర్త కోసం వంట ఏం చేసావని వంటమనిషిని ఫోన్లో అడిగిన భార్య.. అతడి సమాధానం విని డౌట్..ఇంటికొచ్చి చూస్తే.. !

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి అనే బంధం పవిత్రమైనది. ఇది సమాజానికి మూలం స్తంభం. కానీ కొందరు వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని అర్థం చేసుకోలేక చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి ఒక్కోసారి హింసాత్మక ఘటనలకూ దారి తీస్తున్నాయి. అయితే, ఓ వంటమనిషి కారణంగా ఇంటి యజమాని నిర్వాకం బయటకొచ్చిన తీరు చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

బెంగళూరుకు చెందిన ఓ ఫిజియోథెరపిస్టు తన వద్ద పని చేస్తున్న కుక్ చెప్పిన విషయాలను తాజాగా నెట్టింట పంచుకున్నారు. అతడు చేసిన పనికారణంగా ఓ వ్యక్తి వివాహేతర సంబంధం ఎలా బయటపడిందీ చెప్పుకొచ్చారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, ఆ కుక్ ఓ ఇంట్లో పనిచేస్తుంటాడు. కొంతకాలం క్రితం ఇంటి యజమాని భార్య ఏదో పనిమీద దూర ప్రాంతానికి వెళ్లింది. ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ ఇంటి యజమాని తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లోని కుక్‌కు ఆమెను తన సోదరిగా పరిచయం చేశాడు (Bengaluru woman shares how her cook busted revelead)

Viral: మహిళా కార్పొరేట్ ఉద్యోగి వింత రాజీనామా! ఇలాంటి లేఖ భూప్రపంచంలో మరొకటి ఉండదు!


ఈ క్రమంలో ఓ రోజు ఇంటి యజమాని భార్య ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తిన కుక్‌ను వంట ఏమి వండావని ప్రశ్నించింది. ఈ క్రమంలో అతడు ఇంట్లో ఇద్దరికీ కలిపి వండానని చెప్పేశాడు. దీంతో, ఆ మహిళకు డౌట్ మొదలైంది. మరుసటి రోజునే ఇంటికొచ్చి ఆమె తన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఫలితంగా వారి పెళ్లి పెటాకులైంది. ఆ ఇద్దరూ విడాకులు తీసుకుని వేర్వేరు ఫ్లాట్లలో ఉండటం ప్రారంభించారు.ఈ విషయాలన్నీ చెప్పిన సదరు ఫిజియోథెరపిస్టు.. ఆ కుక్ ఇప్పుడు ఆ ఇద్దరి ఇళ్లల్లోనూ పనిచేస్తున్నాడని చెప్పింది.

స్టోరీ మొత్తం విన్న నెటిజన్లు పడీపడీ నవ్వుతున్నారు. కుక్‌కు అబద్ధం చెప్పిన యజమాని చేజేతులా తన కాపురం కూల్చుకున్నా డని కొందరు కామెంట్ చేశారు. ఈ కథనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Updated Date - Dec 24 , 2023 | 10:21 PM