Share News

Tomato: అంతరిక్షంలో కనిపించకుండాపోయిన టమాటా.. 8 నెలల తర్వాత దొరికింది.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-12-09T07:36:01+05:30 IST

Tomato Missing on Space Station: మాములుగా మన ఇళ్లలో టమాటా (Tomato) గానీ, ఇతర కూరగాయాలు గానీ కనిపించకుండాపోతే ఏదో ఎలుకనో మరేదో తినేసి ఉంటుందితే అని లైట్ తీసుకుంటాం. కానీ, అదే టమాటా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (International Space Station) మిస్సైతే మాత్రం భద్రతా పరంగా కొంచెం రిస్క్ అనే చెప్పాలి.

Tomato: అంతరిక్షంలో కనిపించకుండాపోయిన టమాటా.. 8 నెలల తర్వాత దొరికింది.. అసలేం జరిగిందంటే..!

Tomato Missing on Space Station: మాములుగా మన ఇళ్లల్లో టమాటా (Tomato) గానీ, ఇతర కూరగాయాలు గానీ కనిపించకుండాపోతే ఏదో ఎలుకనో మరేదో తినేసి ఉంటుందిలే అని లైట్ తీసుకుంటాం. కానీ, అదే టమాటా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (International Space Station) మిస్సైతే మాత్రం భద్రతా పరంగా కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఇదే విషయం నాసా సైంటిస్టులను ఎనిమిది నెలలపాటు కంటిమీద కనుకులేకుండా చేసింది. చివరికి 8నెలల తర్వాత కనిపించకుండాపోయిన టమాటా దొరకడంతో సైంటిస్టులు ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే.. నాసా (NASA) కొంతకాలంగా ఐఎస్ఎస్‌లో మొక్కలు, కూరగాయలు పండించడం చేస్తూ ప్రయోగాలకు తెరలేపింది. దీనిలో భాగంగా 'వెజ్‌-05' పేరిట రాబిన్ డ్వార్ఫ్ రకానికి చెందిన టమాటలను కూడా పండించింది.

ఇది కూడా చదవండి: Viral: 148 దేశాలను చూపిస్తామని రూ.26 లక్షలను తీసుకుని.. చివరకు ఆ మహిళను రోడ్డున పడేశారు..!

అలా పండించిన టమాటలను అంతరిక్ష కేంద్రంలోని వ్యోమోగాములు పరిశోధనల కోసం చెరోకటి తీసుకున్నారు. అలా ఫ్రాంక్ రుబియో (Frank Rubio) అనే వ్యోమ‌గామికి ఒక టమాటా వ‌చ్చింది. దానిని అతడు జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టారు. అయితే, ఈ ఏడాది మార్చి 29వ తేదీన ఆ టమాటా అనుకోకుండా అతని చేతి నుంచి జార‌డంతో అంతరిక్ష కేంద్రంలోనే దూరంగా వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత దాని కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఆ 2.5 సెం.మీ. ట‌మాటా క‌నిపించ‌క‌పోవ‌డంతో సెప్టెంబ‌ర్ 13 అది మిస్సైనట్లు నాసా సైంటిస్టులు అధికారికంగా ధృవీక‌రించడం జరిగింది. ఈ క్రమంలో అది దొరకకపోవడం వల్ల ఫ్రాంక్ రుబియో దానిని తినేశాడనే అపవాదును కూడా ఎదుర్కొన్నారు. కానీ, 8నెలల తర్వాత అది దొర‌క‌డంతో నాసా వ్యోమోగాములు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా వ్యోమోగామీ జాస్మిన్ మోగ్‌బిలి బుధ‌వారం ఒక సరదా ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: Viral News: రెండు దోశలు, ప్లేట్ ఇడ్లికి రూ.1000 బిల్.. అదేంటని అడిగిన కస్టమర్‌కు రెస్టారెంట్ షాకింగ్ రిప్లై!

'మా మిత్రుడు ఫ్రాంక్ రుబియో ఐఎస్ఎస్‌లో ట‌మాటా దొంగత‌నం చేసి తినేశాడ‌ని ఇంతవరకు ఒక అప‌వాదు ఉండేది. ఇక మేము అత‌ణ్ని నిర్దోషిగా ప్రకటిస్తున్నాం. ఆ ట‌మాటా దొరికేసింది' అని తన ఫన్నీ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు టమాటా దొరకడం పట్ల ఫ్రాంక్ రుబియో సైతం ఆనందం వ్యక్తం చేశారు. అది కనిపించకుండాపోవడంతో సుమారు 18 నుంచి 20 గంటలు వెతికానని, అయినా దాని జాడ దొరకకపోవడంతో నిరాశ చెందినట్లు చెప్పారు. మళ్లీ ఎనిమిది నెలల తర్వాత మిస్సైన టమాటా కనిపించడంతో హ్యాపీగా ఉందన్నారు. కాగా, ఐఎస్ఎస్ ఏర్పాటై డిసెంబర్ 6వ తేదీ నాటికి పాతికేళ్లు పూర్తైన సందర్భంగా బుధవారం (డిసెంబర్ 6న) ఈ స‌ర‌దా ప్రకటన చేశారు.

Updated Date - 2023-12-09T09:07:22+05:30 IST