OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-03-05T08:47:46+05:30 IST

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ చౌక దొరుకుతోంది. దీంతో ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది..

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ చౌక దొరుకుతోంది. దీంతో ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీని వల్ల అందరికీ ఇంటి దగ్గరే సులువుగా వినోదం దొరుకుతోంది. థియేటర్‌లో విడుదలైన చిత్రాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మార్చి 4న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

బుట్టబొమ్మ (Butta Bomma)

భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌. ఆ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘బుట్టబొమ్మ’. మలయాళం హిట్ ‘కప్పేలా’ (Kappela)కు రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రంలో అనికా సురేంద్రన్‌ (Anikha Surendran), సూర్య వశిష్ఠ (Surya Vashistta), అర్జున్‌ దాస్‌ (Arjun Das) కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి సత్య (అనికా సురేంద్రన్‌). ఆమె చాలా సాధారణ జీవితం గడుపుతుంటుంది. ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం ఓ డబ్బున్న కుర్రాడు తపన పడుతుంటారు. కానీ, ఓ రాంగ్‌ నంబర్‌ సత్య జీవితాన్ని మార్చేస్తుంది. కనీసం ఒక్కసారైనా చూడకుండానే ఫోన్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమిస్తుంది. తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం ఓకే చేయడంతో ప్రేమించిన వ్యక్తి దగ్గరకు వెళ్తుంది. కానీ, ఆ తర్వాత ఆమె జీవితం ఎటువంటి మలుపులు తిరిగిందనేది సినిమా కథ. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Butta-bomma.jpg

నయికా దేవి: వారియర్ క్వీన్ (Nayika Devi: The Warrior Queen)

నయికా దేవి: వారియర్ క్వీన్ అనేది 2022లో విడుదలైన గుజరాతీ చారిత్రక నాటక చిత్రం. నితిన్ గావ్డే దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఉమేష్ శర్మ నిర్మించాడు. సోల్ంకి రాజ్‌పుత్ క్వీన్ నయికా దేవి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఖుషి షా, చంకీ పాండే, మనోజ్ జోషి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

nayika.jpg

సోనీ లివ్ (Sony LIV)

The Crunchyroll Anime Awards 2023 - ఇంగ్లిష్

ఇవి కూడా చదవండి:

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-05T08:47:46+05:30 IST