#HappyBirthdayKCR: కేసీఆర్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, మహేశ్ బాబు

ABN , First Publish Date - 2023-02-17T13:43:07+05:30 IST

నేడు (ఫిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

#HappyBirthdayKCR: కేసీఆర్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, మహేశ్ బాబు

నేడు (ఫిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు టాలీవుడ్‌ హీరోలు సైతం తెలంగాణ సీఎంకి సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్విట్టర్ వేదికగా.. ‘మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం మంచి ఆరోగ్యమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్నీ జరుపుకోవాలి’ అని రాసుకొచ్చారు.


ఇది కూడా చదవండి: Anushka Shetty: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్వీటీ.. మొదలుపెడితే 20 నిమిషాలపాటు నాన్‌స్టాప్‌గా..

అలాగే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ( Mahesh Babu)సైతం.. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ జీవితం మరింత అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ని షేర్ చేశారు.

Updated Date - 2023-02-17T13:43:19+05:30 IST