Super Star Krishna Fan: ఇంట్లో శుభకార్యం.. ఈ వీరాభిమాని ప్రత్యేకత ఇదే!

ABN , First Publish Date - 2023-02-16T19:32:29+05:30 IST

ఒక్కసారి హీరోపై అభిమానం పెంచుకుంటే.. ఆ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా అభిమానులు వెనుకాడరు. ఆ హీరోని తమ ఇంట్లోని పర్సన్‌గా వారు భావిస్తుంటారు. ఇంట్లో జరిగే వేడుకలైనా

Super Star Krishna Fan: ఇంట్లో శుభకార్యం.. ఈ వీరాభిమాని ప్రత్యేకత ఇదే!
Super Star Krishna Fan with G Adiseshagiri Rao

ఒక్కసారి హీరోపై అభిమానం పెంచుకుంటే.. ఆ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా అభిమానులు వెనుకాడరు. ఆ హీరోని తమ ఇంట్లోని పర్సన్‌గా వారు భావిస్తుంటారు. ఇంట్లో జరిగే వేడుకలైనా, మరే ఇతర విషయాలైనా సరే.. తమ అభిమాన హీరోలని కూడా భాగం చేసే వీరాభిమానులు నేడు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఏలూరు జిల్లా (Eluru District) జంగారెడ్డిగూడెం (Jangareddygudem)కి చెందిన బవిరిశెట్టి మురళీ కృష్ణ (Bavirishetty Murali Krishna) ఒకరు. ఈయన సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna)కు వీరాభిమాని (Super Star Krishna Fan). గత 20, 30 సంవత్సరాల నుంచి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా (Krishna and Mahesh Babu Fans Association President) కొనసాగుతూ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. మురళీ కృష్ణ జంగారెడ్డిగూడెంలో జ్యూస్ సెంటర్ నడుపుతుంటారు. సూపర్‌స్టార్ ఫ్యామిలీ (Super Star Family)తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. సూపర్ స్టార్ ఫ్యామిలీకి ఆయన ప్రత్యేక ఆహ్వానం పంపిస్తారు. అంతేకాదు, ఆహ్వాన పత్రికపై కృష్ణ, మహేష్ బాబు ఫొటోలను కూడా ఆయన ముద్రిస్తారంటే.. మురళీ కృష్ణ ఎలాంటి వీరాభిమానో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మురళీ కృష్ణ ఇంటిలో శుభకార్యం జరుగుతోంది. తన మూడవ కుమారుడి వివాహానికి (Son Marriage) అన్ని సిద్ధమయ్యాయి. కానీ ఈసారి ఆహ్వాన పత్రిక (Marriage Invitation) అందుకునేందుకు సూపర్ స్టార్ కృష్ణ లేకపోవడంతో.. ఎంతో బాధగా ఉందని అంటున్నారు మురళీ కృష్ణ.

Krishna-2.jpg

సూపర్ స్టార్ కృష్ణ లేనప్పటికీ ఆయన ఆశీస్సులు మాత్రం ఎప్పటికీ తన ఫ్యామిలీకి ఉంటాయని అంటున్న మురళీ కృష్ణ.. కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికను కృష్ణ సోదరుడైన ఆదిశేషగిరిరావు (Adiseshagiri Rao)‌కు అందజేశారు. ఘట్టమనేని కుటుంబానికి (Ghattamaneni Family) చెందిన ఆదిశేషగిరిరావుకు ఆహ్వాన పత్రిక అందించిన అనంతరం బవిరిశెట్టి మురళీ కృష్ణ మాట్లాడుతూ.. సూపర్ సార్ ఘట్టమనేని కృష్ణ కుటుంబంతో ఉన్న అనుబంధం (Relation) ఎనలేనిదని అన్నారు.

Super.jpg

‘‘సూపర్ స్టార్ కృష్ణగారితో, వారి కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం నాకెంతో ప్రత్యేకమైనది. మా కుటుంబంలో జరిగే ఏ వేడుకైనా వారికి ఆహ్వానం పంపించి ఆశీస్సులు తీసుకుంటాం. మా కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యానికి ఘట్టమనేని ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి. నా మొదటి తనయుడు భవిరి శెట్టి తిలక్ పెళ్లికి వేయించిన శుభలేఖల్లో కృష్ణ, మహేష్ బాబు (Mahesh Babu)గారి ఫోటోలను ముద్రించి.. ఘట్టమనేని కుటుంబంలోని అందరికీ పంపించాము. రెండో కుమారుడి పెళ్లికి కూడా అలాగే చేశాను. ఇప్పుడు మూడో కుమారుడి వివాహం జరగబోతోంది. కానీ, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణగారు లేకపోవడం ఎంతో బాధ కలిగిస్తోంది. ప్రస్తుతం వారి సోదరుడైన ఆదిశేషగిరిరావుగారికి మొదటి పత్రిక అందించి ఆశీస్సులు తీసుకున్నాం. కృష్ణగారే కాదు, విజయనిర్మల (Vijaya Nirmala)గారు కూడా నన్ను చాలా ప్రత్యేకంగా చూసేవారు. ముఖ్యంగా విజయనిర్మలగారి పుట్టినరోజున ఆమె ఇచ్చే ప్రత్యేక విందుకు నన్ను తప్పక పిలిచేవారు..’’ అని మురళీ కృష్ణ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-02-16T19:38:25+05:30 IST