ఏటియంలో డబ్బు డ్రా చేస్తుండగా కుర్రాడిపై దాడి.. దాడి చేసిందెవరో తెలిసి పోలీసులకే ఫ్యూజులెగిరిపోయాయి..

ABN , First Publish Date - 2023-03-17T11:11:53+05:30 IST

మెడ మీద కత్తి పెట్టి 'డ్రా చేసిన డబ్బు ఇచ్చెయ్' అంటూ బెదిరిస్తే.. ఆ కుర్రాడు మాత్రం..

 ఏటియంలో డబ్బు డ్రా చేస్తుండగా కుర్రాడిపై దాడి.. దాడి చేసిందెవరో తెలిసి పోలీసులకే ఫ్యూజులెగిరిపోయాయి..

దొంగతనాలు, దాడుల గురించి ప్రతిరోజు వింటూనే ఉంటాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా, పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వీటికి అదుపు ఉండటం లేదు. ఓ కుర్రాడు ఏటీయం కు వెళ్ళి డబ్బు డ్రా చేసుకుంటున్నప్పుడు అతడిమీద దాడి జరిగింది. మెడ మీద కత్తి పెట్టి 'డ్రా చేసిన డబ్బు ఇచ్చెయ్' అంటూ ఓ వ్యక్తి ఆ కుర్రాడిని బెదిరించాడు. అయితే ఆ తరువాత చాలా షాకింగ్ నిజం బయటకొచ్చింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

స్కాట్లాండ్(Scotland) దేశంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. 17ఏళ్ళ కుర్రాడు(17 Years Young Man) ఏటీయం(ATM)కు వెళ్ళి డబ్బు డ్రా(Money With draw) చేస్తున్నాడు. అదే సమయంలో ముఖానికి ముసుగు వేసుకుని ఓ వ్యక్తి ఏటీయంలోకి జొరబడ్డాడు. అతను జొరబడే సమయానికి కుర్రాడు డబ్బు తీసి పాకెట్ లో పెట్టుకున్నాడు. అతను కుర్రాడిని గోడకు నెట్టి కత్తి తీసి మెడమీద ఉంచి 'డ్రా చేసిన డబ్బు నాకు ఇచ్చెయ్.. లేకపోతే చంపేస్తాను' అని బెదిరించాడు. అయితే ఆ కుర్రాడు అతని మాటలకు భయపడలేదు. 'ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే' అని ఆలోచనలో పడ్డాడు. అంతలోనే అతనికి ఆ గొంతు ఎవరిదో తెలిసిపోయింది. ముసుగు వ్యక్తి మళ్ళీ ఆ కుర్రాడితో 'ఆలోచిస్తున్నావేంటి డబ్బు నాకు ఇచ్చెయ్' అని మరింత గట్టిగా బెదిరిస్తూ చెప్పాడు. దీంతో కుర్రాడు 'మీకేమైనా పిచ్చా? నేనెవరో తెలిసి కూడా ఇలా చేస్తున్నారా?' అని ఆవేశంగా అడిగాడు. 'నువ్వు ఎవరైతే నాకేంటి? డబ్బు తీసి నాకు ఇచ్చెయ్' అన్నాడు ముసుగు వ్యక్తి. దీంతో ఆ కుర్రాడు 'అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? నేనెవరో తెలీదా..' అంటూ ముఖానికి వేసుకున్న మాస్క్ తీసేశాడు. అంతే ఆ ముసుగు వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ కుర్రాడు తన రక్తం పంచుకుపుట్టిన కొడుకే.. కొడుకు తన తండ్రి గొంతు గుర్తుపట్టాడు కానీ తండ్రి తన కొడుకును కొంచెం కూడా గుర్తుపట్టలేకపోయాడు.

ఎందుకిలా దొంగతనానికి ప్రయత్నించావని కొడుకు తండ్రిని అడిగాడు. ఎలాంటి సంపాదనా లేకపోవడంతో తను చాలా నిరాశలో ఉన్నానని, తనకు డబ్బు అవసరమై ఇలా చేశానని కొడుకుతో చెప్పాడు. దీని తరువాత కొడుకు పోలీసులకు సమాచారం అందించాడు. తను డబ్బు దోచుకోవడానికి ప్రయత్నం చేసినట్టు ఆ తండ్రి కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. ఏటీయంలో డబ్బు డ్రా చేస్తున్నది తన కొడుకే అనే విషయం తనకు తెలియదని, ముఖానికి మాస్క్ వేసుకోవడం వల్ల తాను గుర్తుపట్టలేకపోయానని అతను చెప్పాడు. కుర్రాడు అతని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం మొత్తం వివరించాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా అతని అరెస్ట్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. పోలీసులు అతడిని కోర్టులో హాజరు పరచగా నేరాన్ని అంగీకరించినందుకు కొంచెం శిక్షను తగ్గించి 26నెలల జైలు శిక్ష విధించింది.

Read Also: Viral Video: మంచు చిరుత వేట ఎప్పుడైనా చూశారా? దాని పరుగు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్!


Updated Date - 2023-03-17T11:11:53+05:30 IST