వీళ్లు మామూలువాళ్లు కాదు.. చివరకు దోమల మందును కూడా వదల్లేదుగా..

ABN , First Publish Date - 2023-06-02T10:25:53+05:30 IST

దోమల నిర్మూల పథకంలో భాగంగా మందు కొనుగోళ్లలో అవినీతికి పాల్పడినందుకు మున్సిపల్‌ కమిషనర్‌ సహా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ను రాష్ట్ర మున్సిపాలిటీ

వీళ్లు మామూలువాళ్లు కాదు.. చివరకు దోమల మందును కూడా వదల్లేదుగా..

అడయార్‌(చెన్నై): దోమల నిర్మూల పథకంలో భాగంగా మందు కొనుగోళ్లలో అవినీతికి పాల్పడినందుకు మున్సిపల్‌ కమిషనర్‌ సహా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ను రాష్ట్ర మున్సిపాలిటీల నిర్వహణ డైరెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ జిల్లాలోని పుంజైపులియంపట్టి మున్సిపాలిటీ(Municipality)లో దోమల మందు కొనుగోలులో నిధుల దుర్వినియోగం (అవినీతి) జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై మున్సిపాలిటీల నిర్వహణ సంచాలకుడికి ఆ మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసి పంపించింది. దీన్ని పరిశీలించిన డైరెక్టర్‌ విచారణ జరిపించగా, అవినీతికి పాల్పడినట్టు తేలింది. దీంతో మున్సిపాలిటీ కమిషనర్‌ సయ్యద్‌ హుస్సేన్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ సెంథిల్‌లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు

Updated Date - 2023-06-02T10:25:53+05:30 IST