ఫ్రీగా కోడి మాంసం తినొచ్చు కదా అని అత్యాశకు పోయి.. 15 గంటల పాటు నరకం అనుభవించాడు.. అసలేం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-02-25T14:52:14+05:30 IST

పాపం.. ఆ వ్యక్తి కోడి కోసం ఆశపడి బోనులో చిక్కుకున్నాడు.. రాత్రంతా అందులోని పడి ఉండి నరకం అనుభవించాడు.. చివరకు తర్వాతి రోజు గ్రామస్థుల దయ వల్ల బయటపడ్డాడు.. అసలేం జరిగిందో తెలుసుకుంటే నవ్వకుండా ఉండలేం.

ఫ్రీగా కోడి మాంసం తినొచ్చు కదా అని అత్యాశకు పోయి.. 15 గంటల పాటు నరకం అనుభవించాడు.. అసలేం జరిగిందో తెలిస్తే..

పాపం.. ఆ వ్యక్తి కోడి కోసం ఆశపడి బోనులో చిక్కుకున్నాడు.. రాత్రంతా అందులోని పడి ఉండి నరకం అనుభవించాడు.. చివరకు తర్వాతి రోజు గ్రామస్థుల దయ వల్ల బయటపడ్డాడు.. అసలేం జరిగిందో తెలుసుకుంటే నవ్వకుండా ఉండలేం.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బులంద్‌షహర్ సమీప గ్రామాల్లో కొద్ది రోజులుగా ఓ చిరుత పులి (Leopard) తిరుగుతోంది. గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అటవీ అధికారులు ఆ గ్రామానికి చేరుకుని చిరుత కోసం అన్వేషణ సాగించారు. అయితే వారికి చిరుత ఎక్కడా కనిపించలేదు. దీంతో వారు ఆ గ్రామంలో ఓ బోను (Cage) ఏర్పాటు చేశారు. చిరుతను ట్రాప్ చేసేందుకు బతికి ఉన్న కోడిని లోపల కట్టేసి ఉంచారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి బోనులో ఉన్న కోడిని (Chicken) చూశాడు. దానిని పట్టుకుని కోసుకుని తిందామనుకున్నాడు. అది చిరుత కోసం వేసిన ఎర అని తెలియక కోడిని పట్టుకునేందుకు బోను లోపలికి వెళ్లిపోయాడు.

Viral: అలాంటి వారు మా పెళ్లికి రావొద్దు.. శుభలేఖలో ఓ జంట వినూత్న విన్నపం.. వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక..

సతీష్ లోపలికి వెళ్లగానే బోను తలుపు మూసుకుపోయింది. రాత్రి సమయం కావడంతో చుట్టు పక్కల ఎవరూ లేరు. దీంతో రాత్రి 8 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 11 గంటల వరకు ఒంటరిగా ఒక్కడే అందులో ఉండిపోయాడు. తర్వాతి రోజు ఉదయం గ్రామస్థులు వచ్చి బోనులో ఉన్న సతీష్‌ను చూసి షాకయ్యారు. వెంటనే అతడిని బయటకు తీశారు.

Updated Date - 2023-02-25T14:52:16+05:30 IST