Taraka ratna: పుట్టిన రోజున భార్య ఎమోషనల్‌ పోస్ట్‌!

ABN , First Publish Date - 2023-02-23T10:05:26+05:30 IST

నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబంతోపాటు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. భర్త దూరం కావడంతో ముగ్గురు బిడ్డలతో అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Taraka ratna: పుట్టిన రోజున భార్య ఎమోషనల్‌ పోస్ట్‌!

నందమూరి తారకరత్న (Tarkaratna) మరణం ఆయన కుటుంబంతోపాటు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. భర్త దూరం (Rip tarakaratna) కావడంతో ముగ్గురు బిడ్డలతో అలేఖ్య రెడ్డి (alekhya reddy)తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 40వ పుట్టినరోజుకు మూడు రోజుల ముందు ఆయన కన్నుమూయడంతో ఆమె తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నెల 18న తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే! బుధవారం ఆయన పుట్టిన రోజు. దానిని గుర్తు చేసుకుని తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి సోషల్‌ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్‌ చేశారు. తారకరత్న తన కూతురు నిష్కతో ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. (Alekhya reddy Emotional post on Tarakaratna)

‘‘నా జీవితంలో ఉత్తమ తండ్రి, ఉత్తమ తండ్రి, ఉత్తమ భర్త, మంచి మనసున్న వ్యక్తివి. హ్యాపీ బర్త్‌ డే.. నిన్ను చాలా మిస్సవుతున్నాం’’ అంటూ భావోద్వేగంగా పోస్ట్‌ చేశారు. ఆమె పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ ‘నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం’ తారకరత్న అన్న అని పోస్టులు పెడుతున్నారు.

గత నెల 26 యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. సమీప ఆస్పత్రిలో చికిత్స అందించగా, మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 23 రోజులుగా చికిత్స పొందిన ఆయన ఈ నెల 18న తుది శ్వాస విడిచారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన చిన్న కార్యక్రమం జరిగింది.

Updated Date - 2023-02-23T12:04:10+05:30 IST