Swiggy Delivery Boy: అరగంట ఆలస్యమైందేంటని అసహనం.. ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ చెప్పింది విని ఆమెకు షాక్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-06-16T13:53:21+05:30 IST

ఓ మహిళ స్విగ్గీలో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు ఆర్డర్ రావల్సిన సమయం గడిచినా అందలేదు. అరగంట దాటిన తరువాత డెలివరీ బాయ్ ఐస్ క్రీమ్ తెచ్చిచ్చాడు. అప్పటికే అసహంగా ఉన్న ఆమె ఎందుకింత లేటయ్యిందని కోపంగా ప్రశ్నించింది. మేడమ్ 3కి.మీ నడిచి మీ ఆర్డర్ తీసుకొచ్చానంటూ అతను సమాధానం ఇచ్చాడు. ఏం చదివావని ఆమె అడిగితే..

Swiggy Delivery Boy: అరగంట ఆలస్యమైందేంటని అసహనం.. ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ చెప్పింది విని ఆమెకు షాక్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

స్విగ్గి, జొమోటో ఆన్లైన్ ఫుడ్ సర్వీసింగ్ అందుబాటులోకి వచ్చాక ఆకలి అనే విషయంలో కాస్త ఊరట లభించింది చాలా మందికి. ఆర్డర్ పెట్టిన అరగంట నుండి గంటలోపు వేడి వేడి ఆహారాన్ని అందుకోవడం, ఆస్వాదించడం అందరికీ ఇష్టమే. అయితే ఇలా ఆహారం డోర్ డెలివరీ వెనుక డెలివరీ బాయ్ ల కష్టం చాలా ఉంటుంది. ఓ మహిళ స్విగ్గిలో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుంది. అయితే ఆమె ఆర్డర్ పెట్టి అరగంట అయినా డెలివరీ అందలేదు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురైంది. తీరా డెలివరీ బాయ్ ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చాక ఎందుకింత లేటయ్యిందని ఆమె కోపంగానే అడిగింది. ఆ డెలివరీ బాయ్ చెప్పంది విని ఆమె షాక్ కు గురైంది. ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

టెక్ కంపెనీ ఫ్లాష్ లో మార్కెటింగ్ మేనేజర్(Marketing manager in tech company flash) గా పనిచేస్తున్న ప్రియాంషి చందేల్ అనే మహిళ స్విగ్గి లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుంది(women order ice cream in swiggy). అయితే ఆమె ఆర్డర్ అందాల్సిన సమయం కంటే అరగంట ఎక్కువ గడిచినా అందలేదు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురైంది. ఈ క్రమంలో కొద్దిసేపటి తరువాత సాహిల్ సింగ్ అనే డెలివరీ బాయ్ ఆమెకు ఆర్డర్ డెలివరీ ఇచ్చాడు. 'ఇంత లేటయ్యింది ఏంటి?' అని ఆమె డెలివరీ బాయ్ ని కోపంగానే ప్రశ్నించింది. అప్పుడు ఆ డెలివరీ బాయ్ చెప్పిన విషయం చాలా షాకింగ్ గా ఉంది. ప్రియాంషి చందేల్ కు ఐస్ క్రీమ్ ఇచ్చిన తరువాత డెలివరీ బాయ్ సాహిల్ ఇలా చెప్పాడు. 'మేడమ్ నాకు స్కూటీ కానీ బైక్ కానీ లేదు, 3కి.మీ నడిచి మీ ఆర్డర్ తీసుకొచ్చాను. నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బును నా రూమ్మేట్ తీసుకున్నాడు, నా యులు బైక్(yulu bike) కూడా అప్పులోనే ఉంది. ఇంటి యజమానికి రెంట్ కట్టడానికి కూడా నా దగ్గర ఏమీలేవు. నేను గత వారం రోజుల నుండి ఆహారం కూడా తినలేదు. నీళ్లు, టీ మాత్రమే తీసుకుని ఉంటున్నాను. మీకు ఈ ఆర్డర్ ఇచ్చినా నాకు 20-25రూపాయలు మాత్రమే వస్తాయి. ఇవన్నీ వింటే మీరు నేను స్టోరీస్ చెబుతున్నాను అనుకుంటారేమో.. కానీ నేను ECEలో ఇంజనీరింగ్(Delivery boy did ECE in engineering) చేశాను. కోవిడ్ కు ముందు నేను నింజాకార్ట్ , బైజూస్(Ninjacart, byju's) లో పనిచేసేవాడిని. అప్పుడు నాకు 25వేల శాలరీ ఉండేది. కానీ కరోనా వల్ల జాబ్ పోయింది. అందుకే జమ్మూలో మా ఇంటికి వెళ్ళిపోయాను. కానీ ఏదో ఒక పని చేసుకోవాలి కదా.. ఇప్పుడు నావయసు 30ఏళ్ళు, మా తల్లిదండ్రులు వృద్దులు. వారిని నేను డబ్బు అడగలేను.' అని తన గోడు ఆమె ముందు చెప్పుకొచ్చాడు.

b.tech.gif

Viral Video: ఈ కుర్రాడి వింత చేష్టలకు ఉలిక్కి పడిన యువతి.. పక్కనున్న ట్రెడ్‌మిల్‌పైకి సైలెంట్‌గా వచ్చి.. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే..!


సాహిల్ చెప్పింది మొత్తం వినగానే చందేల్ కళ్లు చెమర్చాయి. ఆమె వెంటనే అతని సర్టిఫికేట్స్ సాఫ్ట్ కాపీలు, మార్క్ షీట్ లు, అతని ఇ-మెయిల్ అడ్రస్, ఫోటోస్ ను లింక్డ్ఇన్ లో అప్ లోడ్(women upload delivery boy certificates in LinkedIn) చేసింది. సాహిల్ కు సహాయం చేయమని అభ్యర్థించింది. 'అతని విద్యార్హతకు తగిన ఉద్యోగం ఎవరైనా ఇవ్వండి' అంటూ ఆమె పోస్ట్ లో పేర్కొంది. 'ఆఫీస్ బాయ్, అడ్మిన్ వర్క్, కస్టమర్ సపోర్ట్ ఇలా ఎన్నోఉద్యోగాలు ఉంటాయి. దయచేసి నిరుద్యోగులుగా ఉన్నవారికి సహాయం చేయండి' అని ఆమె సోషల్ మీడియా వేదికగా అందరినీ రిక్వెస్ట్ చేసింది. ప్రియాంషి చందేల్ పోస్ట్ చూసిన ఎంతోమంది సాహిల్ కు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఒకరు అతని యులు బైక్ ను రిఛార్జీ చేయించారు. అతని ప్లేస్ లో ఇతరులు ఫుడ్ డెలివరీ ఇచ్చారు. ఇవన్నీ అయ్యాక 'సాహిల్ కు ఉద్యోగం వచ్చింది, అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, మీరందరూ చాలా అద్భుతంగా ఉన్నారు' అని చందేల్ అప్టేట్ చేసింది.

Resignation Letter: మూడే మూడు పదాల్లో రిజైన్‌ లెటర్‌ను ఇచ్చేశాడో ఉద్యోగి.. అసలు ఆ రాజీనామా లేఖలో ఏం రాశాడో చూస్తే..!


Updated Date - 2023-06-16T13:56:12+05:30 IST